బిజినెస్ మేన్ 'సార్ వస్తారా' సాంగ్ వెనుక ఇంత కథ ఉందా.. తమన్ మాటల్లో!

సినిమా కథ ప్రేక్షకులను మెప్పించగలగాలి అంటే దర్శకులు, రచయితలు ఏ విధంగా అయితే కష్టపడతారో.. ఒక సినిమాలోని మ్యూజిక్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే అటు లిరిసిస్ట్.. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అంతే కష్టపడాల్సి ఉంటుంది.

Update: 2026-07-25 05:50 GMT

సినిమా కథ ప్రేక్షకులను మెప్పించగలగాలి అంటే దర్శకులు, రచయితలు ఏ విధంగా అయితే కష్టపడతారో.. ఒక సినిమాలోని మ్యూజిక్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటే అటు లిరిసిస్ట్.. ఇటు మ్యూజిక్ డైరెక్టర్ అంతే కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యూజిక్ పరంగా కూడా సక్సెస్ అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శ్రోతలను అలరించాలంటే మంచి లిరిక్స్ తో పాటు అంతకుమించిన మ్యూజిక్ కూడా అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ తాజాగా లెనిన్ మ్యూజికల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరియర్ లో అత్యంత పట్టుదలతో చేసిన బిజినెస్ మేన్ సినిమాలోని సార్ వస్తారా పాట వెనుక ఉన్న కష్టాన్ని , పట్టుదలను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.

లెనిన్ మ్యూజికల్ ఇంటర్వ్యూ..

అసలు విషయంలోకి వెళ్తే.. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లెనిన్. ఈ చిత్రానికి ఎస్.తమన్ మ్యూజిక్ అందించగా , భాస్కరభట్ల, అనంత శ్రీరామ్ ఈ సినిమాలోని పాటలకు లిరిక్స్ అందించారు. ఈ నేపథ్యంలోనే టీంతో తాజాగా మ్యూజికల్ ఇంటర్వ్యూ నిర్వహించగా అందులో లెనిన్ పాటలతో పాటు మహేష్ బాబు బిజినెస్ మేన్ "సార్ వస్తారా" పాట వెనుక ఉన్న అసలు విషయాన్ని తమన్ చెప్పుకొచ్చారు.

బిజినెస్ మేన్ "సార్ వస్తారా" మాట వెనుక ఇంత పట్టుదల ఉందా?

తమన్ మాట్లాడుతూ.." సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మేన్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమాతో మ్యూజిక్ పరంగా దేశవ్యాప్తంగా సంచలనం కొట్టాలి అనుకున్నాము. అదే సమయంలో "కొలవరి" పాట టాప్ లో దూసుకుపోతోంది. అమితాబ్ బచ్చన్ కూడా ఆ పాటను ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సమయంలో అసలు మేమెప్పుడు ఈ సాంగ్స్ ను బీట్ చేయాలి అని కసితో కూర్చున్నాము. అయితే అనుకోకుండా నా నోటి నుంచి సార్ వస్తారా పాట మ్యూజిక్ వచ్చేసింది. దానిని భాస్కరభట్ల గారు పట్టేసి "తారత్తారా" మ్యూజిక్ తో పాట సెట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇక ఎట్టకేలకు సినిమా కథను దృష్టిలో పెట్టుకొని లిరిక్స్ కూడా రాయాల్సి వచ్చింది. అయితే ఈ పాట అనుకున్నట్టుగానే ఊహించని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఈ పాటకు ఊగిపోయారు.. ఇక ఆ పాటను మేమెంత కష్టపడి కసితో రూపొందించామో మాకు అంతే మంచి ఫలితాన్ని ఇచ్చింది" అంటూ తమన్ తెలిపారు.

లెనిన్ సినిమా కోసం కూడా అంతే కష్టపడ్డాం..

లెనిన్ సినిమా విషయంలో కూడా లిరిక్స్ కోసం అంతే కష్టపడ్డాము. ముఖ్యంగా "బుట్ట బొమ్మను చేసి ప్రాణం పోసి భూమ్మీది వదిలాడు సూడుడు. ఆగమైపోతున్నాడు జీవుడు".. రాసే ప్రతి మాట వాస్తవానికి సింక్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అలా ప్రతి పదాన్ని చాలా ఆచితూచి రూపొందించాము. అలా ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి అంటూ ప్రముఖ లిరిసిస్ట్ భాస్కరబట్ల కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ మ్యూజికల్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .


Full View


Tags:    

Similar News