తమన్.. ఈసారి మెప్పించకపోతే ప్రమాదమేనా?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన హవా కొనసాగుతోంది.;

Update: 2025-12-14 08:41 GMT

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన హవా కొనసాగుతోంది. అదిరిపోయే పాటలతో పాటు దద్దరిల్లిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారనే క్రేజ్ తమన్ కు ఉంది. అదే సమయంలో ఆయనపై సాంగ్స్ విషయంలో కాపీ రైట్స్ మరకలు కూడా ఉన్నాయనే చెప్పాలి.

నిజానికి.. 2025లో ఎన్నో సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రీసెంట్ గా వచ్చిన అఖండ 2: తాండవం చిత్రానికి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. తన వర్క్ తో అందరినీ మెప్పించారు. ఇప్పుడు వివిధ సినిమాలకు గాను పని చేస్తున్నారు. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ కూడా ఒకటి.

హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం ప్రమోషన్స్ పై మేకర్స్ ఫోకస్ చేశారు. స్పెషల్ ప్లాన్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. వరుస అప్డేట్స్ ఇవ్వనున్నారు.

అయితే మ్యూజికల్ ప్రమోషన్స్ లో రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. ప్రభాస్ వింటేజ్ లుక్స్, ఎనర్జిటిక్ స్టెప్పులు కొందరు ఫ్యాన్స్ కు నచ్చినప్పటికీ.. మరికొందరికి ఎక్కలేదు. ఆశించిన స్థాయిలో పాట లేదని, పాన్ ఇండియా స్టార్ కు ఇలాంటి సాంగ్ ఇచ్చారంటూ తమన్ పై ఫైర్ అయ్యారు. రన్ ఇట్ అప్ అనే ఇంగ్లీష్ మ్యూజిక్ వీడియో ట్యూన్ కాపీ కొట్టారని ఆరోపించారు.

ఫస్ట్ టైమ్ ప్రభాస్ తో వర్క్ చేస్తుండడంతో చాలా హోప్స్ పెట్టుకున్నామని కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుండగా.. తమన్ లేటెస్ట్ గా రాజా సాబ్ డే అంటూ పోస్ట్ చేశారు. దీంతో మళ్లీ డార్లింగ్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఈసారైనా మంచి సాంగ్ ఇవ్వాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

సూపర్ బీట్ తో.. క్యాచీ ట్యూన్ తో సాంగ్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. దీంతో తమన్.. ఈసారి ప్రభాస్ అభిమానులను కచ్చితంగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పటికే తొలి సాంగ్ కు వచ్చిన విమర్శలకు దీటుగా.. సెకెండ్ సింగిల్ తో సమాధానం చెప్పాలి. లేకుంటే ఆ ఎఫెక్ట్ మూవీపై పడే అవకాశం ఉంది. మరి తమన్ రాజా సాబ్ సెకండ్ సాంగ్ విషయంలో ఏం చేస్తారో.. ఎలా మెప్పిస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News