• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తలపతి విజయ్.. మళ్ళీ షాక్...

తలపతి విజయ్.. మళ్ళీ షాక్ ఇచ్చేలా ఉన్నాడట

| కాగా ఈ సినిమా తర్వాత విజయ్ కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-01-29 04:30 GMT

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ గత ఏడాది 'లియో' సినిమాతో భారీ సక్సెస్ అందుకొని ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో 'గోట్' అనే సినిమా చేస్తున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'గోట్' తర్వాత ఒకే ఒక్క సినిమా చేసి సినిమాల నుండి బిగ్ బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

విజయ్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిపోయిందని, అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలోనే విజయ్ ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ నటించబోయే సినిమా కోసం పలు తెలుగు, తమిళ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుగుతున్నయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు అగ్ర నిర్మాతలు విజయ్ కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

తన రాజకీయ ప్రచారానికి డబ్బు చాలా అవసరం కాబట్టి విజయ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నారట. అందుకే విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో భారీగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ క్రూషియల్ ప్రాజెక్టుకి కార్తిక్ సుబ్బరాజ్ మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

మరి విజయ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏ నిర్మాణ సంస్థతో చేస్తాడు? ఆ ప్రాజెక్టుకి డైరెక్టర్ ఎవరు? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే టాలీవుడ్ నుంచి 'RRR' నిర్మాత DVV దానయ్య విజయ్ తో ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇందుకోసం విజయ్ కి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Tags:    
  • Kollywood 
  • Leo 
  • Goat 
  • Vijaythalapathy 
  • Vijayvenkatprabhu 
  • Karthiksubbaraj 
  • Rrr 
  • DVVdanayya 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS