టాలీవుడ్ స్టార్స్ అంతా గెట్ టూ గెదర్!
వీరంతా కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తారు గానీ..ఒకే వేదికపై మాత్రం ఏనాడు కలవలేదు. చిరంజీవి తరం నుంచి తర్వాత తరం వరకూ ఎప్పుడైనా ఒకే వేదికపై చూసామా?;
ఇండస్ట్రీలో సీనియర్ హీరోలంతా ఏడాదికొసారి గెట్ టూ గేదర్ అవుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ నుంచి వారి తరం హీరో, హీరోయిన్లు అంతా తప్పక గేదర్ అవుతుంటారు. అందుకు వేదిక ఒక్కోసారి ఒక్కొక్కటిగా హైలైట్ అవుతుంది. ఎక్కువగా హైదరాబాద్ లేదా చెన్నైలోనే మీట్ అవుతుంటారు. ఆ ఒక్క రోజు మాత్రం తారలంతా తమ పాత రోజుల్లోకి వెళ్లిపోతారు. 60-70 వయసు వచ్చేసినా ఆ ఒక్క రోజు మాత్రం వయసు మర్చిపోయి అంతా ఎంజాయ్ చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ డ్రెస్ కూడా ఉంటుంది.
ఆ రోజు మాత్రం తప్పకుండా అంతా అదే డ్రెస్ కోడ్ లో కనిపించాలి. ఇదంతా ప్రతీ ఏటా చూస్తూనే ఉంటాం. కానీ తర్వాత తరం హీరోలు మాత్రం గెట్ టూ గేదర్ అయిన సన్నివేశం ఇంత వరకూ చోటు చేసుకోలేదు. వారి ఫ్యామిలీలు ఒకే చోట అప్పుడప్పుడు కలుస్తుంటారు గానీ...హీరోలంతా ఒకే ప్రేమ్ లో మాత్రం ఏనాడు చిక్కలేదు. పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, రవితేజ, గోపీచంద్, నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, నితిన్ సహా చాలా మంది స్టార్లు ఏనాడు గెట్ టూ గేదర్ ఏర్పాటు చేసుకోవడం జరగలేదు.
వీరంతా కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తారు గానీ..ఒకే వేదికపై మాత్రం ఏనాడు కలవలేదు. చిరంజీవి తరం నుంచి తర్వాత తరం వరకూ ఎప్పుడైనా ఒకే వేదికపై చూసామా? అంటే అది `మా` డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలోనే అప్పుడప్పుడు కనిపిస్తుంది. లేదా సంతాప సభలు, సంక్షేమ కార్యక్రమాల సమయంలో అటెండ్ అవుతుంటారు. ఇదీ చాలా అరుదు. కానీ గెట్ టూ గేదర్ మాత్రం ఏర్పాటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ దిశగా స్టార్ హీరోలంతా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్టార్స్ సహా అంతా మీట్ అవ్వాలనే ప్రపోజల్ ను ఓ పెద్ద స్టార్ పెట్టాడుట.
అందుకు మిగతా స్టార్స్ నుంచి కూడా సానుకూలంగా స్పందన వచ్చిందిట. వారంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారుట. ఇండస్ట్రీకి వచ్చి 20-30 ఏళ్లు అవుతున్నా ఏ రోజు ఒకరికొకరం కలవలేదు అన్న డిస్కషన్ అందరి మధ్య సీరియస్ గానే జరిగిందిట. ఈ విషయంలో పవన్ , మహేష్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించారుట. సాధారణంగా పవన్ కళ్యాణ్ చాలా ప్రయివేట్ గా ఉంటారు. ఇలాంటి విషయాల్లో పెద్దగా కల్పించుకోరు. ఆయన సినిమా ఈవెంట్లకు హాజరవ్వడమే కష్టంగా ఉంటుంది. అలాంటి పవన్ కూడా స్పందించారు అంటే? మీట్ కోసం తాను కూడా ఎంతో ఎగ్జైట్ మెంట్ తోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇంకొన్ని రోజుల్లో బయటకు రానుంది.