శివన్నకు కన్నీళ్లు తెప్పించిన విశ్వనాథ్ అండ్ సన్స్

ఒక ఈవెంట్లో శివన్న మాట్లాడుతూ.. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించాడు.

Update: 2026-09-28 11:10 GMT

గత నెలలో విడుదలైన సూర్య సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. కాకపోతే ఈ మూవీ సూర్య మాతృ భాష అయిన తమిళంలోనే అనుకున్నంతగా ఆడలేదు. కానీ ఈ సినిమా థియేట్రికల్ రన్ అయిపోయి ఓటీటీలోకి వచ్చాక కూడా ప్రశంసలు కొనసాగుతున్నాయి. థియేటర్లలో బాగా ఆడిన కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాయి. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ కు ఆ పరిస్థితి రాలేదు. సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను కొనియాడుతున్నారు. తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ చిత్రానికి గొప్ప కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

ఒక ఈవెంట్లో శివన్న మాట్లాడుతూ.. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించాడు.

"నేను ఈ మధ్య విశ్వనాథ్ అండ్ సన్స్ చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత దాదాపు గంటసేపు నాకు నిద్ర పట్టలేదు. అది నాకు నా తల్లిదండ్రులను, నా తమ్ముడిని, నా కుటుంబాన్ని గుర్తు చేసింది. నేను అలా పడుకుని సినిమా గురించి ఆలోచిస్తూ.. కన్నీళ్లు పెట్టుకున్నాను. నేను కూడా ఏదో ఒక రోజు అలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నా" అని శివరాజ్ కుమార్ చెప్పారు.

శివన్న పెద్ద హీరో అయినా పక్కా ఫ్యామిలీ పర్సన్. చాలా ఎమోషనల్ గా ఉంటారు. తన తండ్రి రాజ్ కుమార్ ను, ముఖ్యంగా చిన్న వయసులో హఠాత్తుగా చనిపోయిన తన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ను తలుచుకుంటే ఆయనకు కన్నీళ్లు వచ్చేస్తాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ కుటుంబ బంధాలు, మానవ సంబంధాల నేపథ్యంలో ఎమోషనల్ గా సాగే సినిమా కావడంతో శివన్న బాగా కనెక్ట్ అయినట్లు ఉన్నాడు. శివన్న స్థాయి నటుడు ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పడం మన తెలుగోడు అయిన ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి పెద్ద కాంప్లిమెంటే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ప్రొడ్యూస్ చేశాడు. వరల్డ్ వైడ్ ఈ సినిమా 250 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Tags:    

Similar News