సీనియర్ హీరోల సినిమాలు ఇంత వేగంగా ఎలా పూర్తవుతున్నాయి...డూప్ ల వినియోగం పై కొత్త చర్చ...

అలా కాకుండా కొంతమంది అసలు హీరోకి బాడీ కి సంబంధం లేని వాళ్ళను తెచ్చి డూప్ లుగా పెడుతున్నారు. దానివల్ల కొందరు చిన్న సినిమాలను తీసేవాళ్ళు దొరికిపోతున్నారు.

Update: 2026-09-28 11:30 GMT

సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా కీలకం. వాళ్ళని బేస్ చేసుకునే ఒక సినిమా తెరకెక్కుతుంది. మొదటి రోజు సినిమా థియేటర్ కి వచ్చే ప్రేక్షకులు సైతం హీరోలను స్క్రీన్ మీద చూడడానికే థియేటర్ కి వస్తారు. వాళ్ళ నటనతో ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంటున్న హీరోలు వాళ్ళ కంటు ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. హీరోలు సినిమా షూటింగ్ లను శరవేగంగా పూర్తి చేయడానికి కీలకపాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు చాలా తొందరగా ఫినిష్ అవుతున్నాయి.

దానికి గల కారణం ఏంటి? సినిమాకి సంబంధించిన పూర్తి డేట్లను హీరోలు కేటాయిస్తున్నప్పటికి దర్శకుడు పూర్తిస్థాయిలో హీరోలను వాడుకుంటూ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి మిగతా షాట్స్ ను డూపులతో తీస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సైతం ఒకానొక సమయంలో స్టేజ్ మీద హీరోలకు డూపులు ఉండాల్సిందే అన్నట్టుగా మాట్లాడాడు... గతంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసినప్పుడు ఒరిజినల్ స్టంట్ అయితే చేశారట. అది చూసిన ఎన్టీఆర్ చిరంజీవి తో బ్రదర్ హీరో అనే అతను చాలా కీలకమైన వ్యక్తి. మనం ఒరిజినల్ గా కొన్ని రిస్కీ షాట్స్ చేయకూడదు. దాన్ని డూప్ తోనే చేయించాలి ఎందుకంటే మనం గాయపడితే సినిమా షూటింగ్ దాదాపు 20 రోజుల నుంచి నెల రోజులపాటు ఆపేయాల్సి వస్తుంది. అలా చేస్తే ప్రొడ్యూసర్ కి చాలా వరకు నష్టం వస్తుంది.

అందుకే ఏమైనా రిస్కీ షాట్స్ ఉంటే డూప్ లతో చేయించాలి తప్ప మనం చేయకూడదు అని చెప్పారంటూ చిరంజీవి ఒక స్టేజి మీద చెప్పాడు. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. హీరోలు రిస్కీ షాట్స్ చేయలేక కాదు వాళ్ళు ఒకవేళ గాయపడితే సినిమాకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్నింటిని డూప్స్ తో చేయించడమే బెటర్... ఇక ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు చాలా తొందరగా సినిమాలను చేసేస్తున్నారు.

దాని వెనక గల అసలు కారణమేంటంటే యాక్షన్ సన్నివేశాలను కాకుండా కొన్ని డైలాగ్ కన్వర్జేషన్ ఉన్న సన్నివేశాల్లో సైతం డూప్ లను వాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి... ముఖ్యంగా హీరో బ్యాక్ షాట్ అలాగే లాంగ్ షాట్ లలో డూప్ లను ఎక్కువగా వాడుతూ అది ఏ మాత్రం ప్రేక్షకుడికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. అయినప్పటికి ప్రేక్షకులు కొన్ని సందర్భాల్లో కొంతమంది డూపులను గుర్తుపట్టేస్తున్నారు. డూప్ లను వాడే టైమ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అచ్చం హీరో మాదిరిగానే ఉండి , అదే హైట్, అదే వేట్, సేమ్ హెయిర్ స్టైల్, కలర్ టోన్ కూడా ఒకే విధంగా ఉంటే పెద్దగా సమస్యలేమి రావు.

అలా కాకుండా కొంతమంది అసలు హీరోకి బాడీ కి సంబంధం లేని వాళ్ళను తెచ్చి డూప్ లుగా పెడుతున్నారు. దానివల్ల కొందరు చిన్న సినిమాలను తీసేవాళ్ళు దొరికిపోతున్నారు. కొన్ని సన్నివేశాల్లో కూడా హీరో ఫేస్ ని క్లోజ్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ గా హీరోనే ఉంటున్నాడు అతని బ్యాక్ నుంచి షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ డూప్ లను వాడి అవతలి వాళ్ళ కౌంటర్ డైలాగులను చిత్రీకరిస్తున్నారు.

దీనివల్ల హీరో డేట్స్ ఎక్కువగా తీసుకోవలసిన అవసరం లేకుండా పోతుంది. షూటింగ్ కూడా తొందరగా పూర్తవుతుంది. కొన్ని సన్నివేశాలు డూప్ లతో నటింపజేసి కేవలం హీరో ఎక్స్ప్రెషన్స్ ను సపరేట్ గా తీసుకొని ఫైనల్ గా విఎఫ్ఎక్స్ ద్వారా అక్కడ డూప్ బాడీకి హీరో ఫేస్ ను ఆడ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ స్పాట్లో ఎప్పుడు బాడీ డబుల్ ఉంటాడు. నిజానికి డూప్ ను వాడటం వల్ల జరిగే యూజ్ ఏంటంటే ఒక లొకేషన్ ను ప్రొడ్యూసర్ ఒక రోజుకి లక్ష రూపాయలు పెట్టి తీసుకుంటాడు.

ఆ ఒక్క రోజులో హీరో తాలూకు అన్ని షాట్స్ తీయాలంటే హీరో రెస్ట్ లేకుండా నటించాలి. అలా చేస్తే అలసిపోతారు కాబట్టి ఆయన నెక్స్ట్ డే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఆ మరుసటి రోజు షూటింగ్ ను నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం షాట్స్ తీయలేక కొన్ని షాట్స్ బ్యాలెన్స్ ఉండి పోతే ఆ కొన్నింటిని తీయడానికి ప్రొడ్యూసర్ నెక్స్ట్ డే కూడా లొకేషన్ కి లక్ష రూపాయలు చెల్లించాలి.

దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చు పెరుగుతుంది. అలా కాకుండా డూప్ లను వాడటం వల్ల లాంగ్ షాట్స్, డ్రోన్ షాట్స్ లను డూప్ లతో తీయవచ్చు. దీనివల్ల ఆ ఒక్క రోజులో షూట్ అయిపోతుంది. ఫైటింగ్ సన్నివేశాల్లో అయితే హీరో రౌడీలను కొట్టినప్పుడు హీరో చేతుల క్లోజ్ ను డూప్ లతో తీసుకుంటారు. అలాగే తన్నినప్పుడు కాళ్ళ క్లోజులు ఏమైనా ఉంటే తీసేసుకుంటున్నారు. దీనివల్ల టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా కొన్ని రిస్కీ షాట్స్ లలో హీరోలకు ప్రమాదాలు జరగకుండా ఉంటుంది...

Tags:    

Similar News