'రామాయ‌ణం' లో క‌ళ్ల‌జోడు ధ‌రించిన వాన‌రం.. షాక్‌కి గురైన జనం!

ప్రస్తుతం ఈ ఇతిహాసాల నేపథ్యంలో మరిన్ని కొత్త చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన `మహాకావ్య శ్రీ రామాయణ కథ` సినిమా మాత్రం ఒక చిన్న పొరపాటు కారణంగా సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది.

Update: 2026-09-28 10:39 GMT

పురాణేతిహాసాలు రామాయ‌ణం, మ‌హాభార‌తంను మన దేశంలో ఎంతో పవిత్రమైన ఇతిహాసాలుగా భావిస్తారు. వీటి ఆధారంగా ఇప్పటికే అనేక సినిమాలు, సీరియల్స్ తెర‌కెక్కాయి. ప్రస్తుతం ఈ ఇతిహాసాల నేపథ్యంలో మరిన్ని కొత్త చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన `మహాకావ్య శ్రీ రామాయణ కథ` సినిమా మాత్రం ఒక చిన్న పొరపాటు కారణంగా సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది.

అభిషేక్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దేవ్ శర్మ రాముడిగా, అంజలి అరోరా సీతగా నటించారు. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లు నెటిజన్ల కంట్లో పడ్డాయి. ఈ పోస్టర్లలో ఒక వానర సైనికుడు లేదా పాత్రధారి త్రేతాయుగానికి అసలు సంబంధం లేని ఒక మోడ్ర‌న్ డే కుర్రాడిలా కళ్లజోడు ధరించి కనిపించడం షాకిస్తోంది.

ఈ పెద్ద పొరపాటును కనీసం దర్శకుడు, ఎడిటర్ లేదా సినిమాటోగ్రాఫర్ గుర్తించలేదా అని ప్రేక్షకులు మండిపడుతున్నారు. అసలు త్రేతాయుగంలో కళ్లద్దాలు ఎక్కడివంటూ నెటిజన్లు రకరకాల మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఇలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్- బాలీవుడ్‌లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న `రామాయణ` వంటి భారీ బడ్జెట్ ఇతిహాస చిత్రాలు రానున్నాయి. ఇలాంటి తరుణంలో చిన్న చిన్న విషయాలపై కూడా దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

ఇదేమీ స్టేజీ డ్రామా కాదు.. లైవ్ లో త‌ప్పు జ‌రిగితే స‌రిదిద్దుకోలేక‌పోవ‌డానికి. కానీ త‌ప్పు జ‌రిగింది.. స‌రిదిద్దుకోలేనంత .. పౌరాణిక లేదా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎంతో సూక్ష్మంగా పరిశీలిస్తారు. కాబట్టి ఇలాంటి చిన్న పొరపాట్లకు కూడా చిత్ర యూనిట్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి భవిష్యత్తులో విడుద‌ల‌కు రానున్న‌ చిత్రాలైనా ఇలాంటి లోపాలకు తావులేకుండా ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం.

Tags:    

Similar News