సినిమాల కోసమే సీక్రెట్‌ మ్యారేజ్‌.. నిజం ఒప్పుకున్న తాప్సి

కొందరు పెళ్లికి హాజరు అయిన గెస్ట్‌లు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో కనిపించకుండా తాప్సి అండ్‌ టీం జాగ్రత్త పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాప్సి పెళ్లిని అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏం వచ్చిందని చాలా మంది ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.

Update: 2026-09-28 08:30 GMT

సొట్టబుగ్గల సుందరి తాప్సి వివాహం జరిగి రెండేళ్లు దాటిన ఇప్పటి వరకు చాలా మందికి కనీసం ఆమె పెళ్లి అయినట్లుగా కూడా తెలియదు. పెళ్లి వైభవంగా ఉదయ్‌ పూర్‌ కోటలో జరిగినప్పటికీ మీడియాలో కవరేజ్‌ రాకుండా చూసుకుంది. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఎక్కడ తన పెళ్లి ఫోటోలు కనిపించకుండా చూసింది. ఒకటి రెండు పెళ్లి ఫోటోలు, వీడియోలు ఉన్నా తన టీం తో తీసి వేయించింది అనే టాక్‌ వచ్చింది. అధికారికంగా కూడా తాప్సి కనీసం ఒక్క ఫోటోను కూడా షేర్‌ చేయలేదు. కొందరు పెళ్లికి హాజరు అయిన గెస్ట్‌లు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో కనిపించకుండా తాప్సి అండ్‌ టీం జాగ్రత్త పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాప్సి పెళ్లిని అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏం వచ్చిందని చాలా మంది ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.

తాప్సి సీక్రెట్‌ వివాహం వెనుక...

తాప్సి సీక్రెట్‌ వివాహం వెనుక ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా తెలియకపోయినా సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. వాటన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే విధంగా తాప్సి క్లారిటీ ఇచ్చింది. తాను సినిమా జీవితంను, వ్యక్తిగత జీవితంను వేరు వేరుగా ఉంచాలి అనుకున్నాను. అందుకే నా పెళ్లికి సంబంధించినంత వరకు వ్యక్తిగత కార్యక్రమంగా మాత్రమే జరిగింది. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అన్నట్లుగానే సాగిందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా పెళ్లి ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ప్రైవసీ దెబ్బ తింటుందని భావించినట్లు పేర్కొంది. పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. కనుక ఆ విషయాన్ని నేను బయటకు చెప్పొద్దు అనుకున్నాను. నేను ఏదో భయపడి పెళ్లి ఫోటోలను షేర్‌ చేయలేదని కొందరు అనుకుంటున్నారు. అందంతా నిజం కాదు. సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా తన వ్యక్తిగత జీవితం ఉండాలని భావించినట్లుగా చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియాలో తాప్సి పెళ్లి ఫోటోలు...

పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం, పత్రికా ప్రకటన ఇవ్వడం, వీడియోలను స్ట్రీమింగ్‌కు అమ్ముకోవడం వంటివి చేయడం అనేది నా వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవడం అవుతుందని తాప్సి పేర్కొంది. తాప్సి మాటలతో సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయనే ఉద్దేశంతో పెళ్లి ని సీక్రెట్‌గా ఉంచినట్లు అనిపిస్తోందని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు తగ్గడం జరిగింది. అందుకే పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి మరికొంత కాలం ఇండస్ట్రీలో హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయాలని ఈ అమ్మడు ఆశ పడినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా తాప్సి తాను అనుకున్నట్లు చాలా సినిమాలు చేసింది. అంతే కాకుండా ఆమె చేతిలో ఇప్పటికీ రెండు మూడు సినిమాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

తాప్సి, మథియాస్‌ బో ల వివాహ ఫోటోలు...

తాప్సి 2024, మార్చి 23న డానిష్ బ్యాడ్మింటన్‌ మాజీ ప్లేయర్‌ మథియాస్‌ బో ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో వివాహం గురించి బయటకు తెలియదు. కానీ పెళ్లి తర్వాత ఆ నోటా ఈ నోటా అన్నట్లుగా పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి. వీరి మధ్య దాదాపుగా 11 ఏళ్ల ప్రేమ వ్యవహారం సాగిందని సమాచారం. 2013లో ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ కోసం మథియాస్ బో వచ్చిన సమయంలో తాప్సితో ప్రేమలో పడ్డట్టు సమాచారం. ప్రేమ, పెళ్లి విషయాన్ని తాప్సి ఇప్పటి వరకు అధికారికంగా బయటకు చెప్పడం లేదు. కానీ ఆమె సన్నిహితులు, ఆమెతో వర్క్ చేసిన వారు కొంచెం కొంచెం అన్నట్లుగా పెళ్లి, ప్రేమ వ్యవహారాలను రివీల్‌ చేస్తూ వస్తున్నారు. పెళ్లి విషయం బయటకు వచ్చినా కూడా తాప్సికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కనుక తాప్సి తన పెళ్లి విషయాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పుకుంటే బాగుంటుంది కదా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News