కోలీవుడ్ లో జక్కన్న మైండ్ గేమ్!
ఒకే వేదికపై సూర్య, రాజమౌళి కనిపించగానే అక్కడున్న వాళ్లకు ఒక క్రేజీ థాట్ వచ్చింది.
దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు తీయడంలోనే కాదు, పబ్లిసిటీ స్ట్రాటజీలను డిజైన్ చేయడంలోనూ మాస్టర్ అని అందరికీ తెలిసిందే. మీడియా అటెన్షన్ ను ఎలా లాగాలి, ఎప్పుడు ఏది మాట్లాడితే ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే లాజిక్ ఆయనకు తెలిసినంతగా బహుశా ఇంకే డైరెక్టర్ కు తెలియదు. రీసెంట్ గా చెన్నైలో జరిగిన తన కొడుకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న ఇచ్చిన ఒక కౌంటర్ ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారింది.
కార్తికేయ నిర్మించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఈవెంట్ కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్ట్ గా రావడం సహజంగానే అంచనాలు పెంచేసింది. ఒకే వేదికపై సూర్య, రాజమౌళి కనిపించగానే అక్కడున్న వాళ్లకు ఒక క్రేజీ థాట్ వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందనే ప్రశ్నను యాంకర్ డైరెక్ట్ గా రాజమౌళి ముందే ఉంచింది. ఇక్కడే జక్కన్న తన మార్క్ మైండ్ గేమ్ ప్లే చేశాడు.
ఇలాంటి టైమ్ లో ఏ డైరెక్టర్ అయినా ఫ్యూచర్ లో కచ్చితంగా చేస్తాం అనో, సరైన కథ దొరికినప్పుడు కలుస్తాం అనో ఒక రెగ్యులర్ డిప్లమాటిక్ ఆన్సర్ ఇస్తారు. కానీ రాజమౌళి అలా చేయలేదు. ఆ కాంబో గురించి ఇక్కడ నేను ఏ చిన్న మాట మాట్లాడినా రేపు మీడియాలో అదే మెయిన్ హెడ్ లైన్ అవుతుందని ఆయన ఓపెన్ గా చెప్పేశాడు. తన కొడుకు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చి, ఆ సినిమాను సైడ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన ఫ్రాంక్ గా తేల్చేశాడు.
సరిగ్గా గమనిస్తే ఇది రాజమౌళి వేసిన ఒక మాస్టర్ స్కెచ్. తన మాటల వెయిట్ ఏంటో, సౌత్ ఇండియా మీడియా తన మీద ఎంత ఫోకస్ పెట్టిందో ఆయనకు పక్కాగా తెలుసు. అందుకే తాను హెడ్ లైన్ ఇవ్వనని చెబుతూనే సినిమా ప్రమోషన్స్ కు ఏమాత్రం డ్యామేజ్ జరగకుండా ఒక కొత్త రకమైన అటెన్షన్ ను క్రియేట్ చేశాడు. ఆన్సర్ దాటవేసినట్లు అనిపించినా అందులో ఒక పక్కా కమర్షియల్ ప్రమోషనల్ యాంగిల్ దాగి ఉంది.
అదే సమయంలో సూర్య ఫ్యాన్స్ ను కూడా ఆయన డిజప్పాయింట్ చేయలేదు. ఎప్పటికైనా తమ కాంబినేషన్ సెట్ అయితే అది కచ్చితంగా స్పెషల్ గా ఉంటుందని చెప్పి ఒక చిన్న స్పార్క్ వదిలాడు. దీంతో అటు డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చింది, ఇటు సూర్య ఫ్యాన్స్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఆశలు సజీవంగా మిగిలాయి. ఒక పక్క మహేష్ బాబుతో వారణాసి అంటూ భారీ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ పనుల్లో బిజీగా ఉంటూనే, ఇలా తన కొడుకు సినిమాకు వచ్చి తన ప్రెజెన్స్ తోనే సినిమా క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు. మీడియాకు కావాల్సిన ఫీడ్ ఇవ్వకుండానే వాళ్ళతోనే తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. మీడియా నాడి పట్టుకోవడంలో రాజమౌళిని కొట్టేవాళ్లు లేరని ఈ మళ్ళీ ప్రూవ్ అయింది.