కథ రాసేటప్పుడు రైటర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

అవన్నీ పకడ్బందీగా చూసుకున్నప్పుడు ఒక కథ బెస్ట్ స్టోరీ గా మారుతుంది. కథ రచయిత సైతం ఆ స్టోరీ లోని అన్ని పాత్రలకు న్యాయం చేసిన వాడు అవుతాడు.

Update: 2026-09-28 06:30 GMT

ఒక సినిమా తెరకెక్కాలి అంటే ముందుగా ఒక మంచి కథ కుదరాలి. కథ రచయిత స్టోరీ రాసేటప్పుడు పలు విధాలుగా కథ గురించి ఆలోచించి దానిని పకడ్బందీగా రాయాల్సిన అవసరమైతే ఉంది. ముందుగా ఆ సినిమా ఎక్కడ సెటప్ అయింది దాని బ్యాక్ డ్రాప్ రాసుకోవాలి. ఆ తర్వాత సినిమాలో ఉండే క్యారెక్టరైజేషన్ ను పర్ఫెక్ట్ గా రాసుకోవాలి. అప్పుడు సినిమా స్టోరీ మీద ఫోకస్ చేయాలి. ఏది ఏమైనా కూడా ఆ ఫోకస్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుడికి నచ్చాలి. అలాంటి క్యారెక్టరైజేషన్ తో స్క్రిప్ట్ ని రాసుకోవాలి దానికి తోడుగా హీరోకి ఏదో ఒక గోల్ ఉండాలి. సినిమాలో లాజిక్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ ను ఫుల్ ఫీల్ చేస్తూ ఆ క్యారెక్టరైజేషన్ కి ఒక పర్పస్ ఉండే విధంగా రాసుకోవాలి.

అవన్నీ పకడ్బందీగా చూసుకున్నప్పుడు ఒక కథ బెస్ట్ స్టోరీ గా మారుతుంది. కథ రచయిత సైతం ఆ స్టోరీ లోని అన్ని పాత్రలకు న్యాయం చేసిన వాడు అవుతాడు. ఒక కథను ఇలా రాసినప్పుడు ఆ కథ మీద ప్రేక్షకుడికి అంచనాలు పెరుగుతాయి. అలాగే దర్శకుడు దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఒక క్లారిటి ఉంటుంది. ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని మెప్పించగలుగుతున్న మన స్టార్ డైరెక్టర్లందరు వీటన్నింటికి కట్టుబడి కథలను రాసుకొని దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నారు.

అందుకే వాళ్లకు భారీ సక్సెస్ లైతే దక్కుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట చాలా మంది స్టార్ డైరెక్టర్లు రాయబోయే కథల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ను తీసుకురావడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు... కథ బాగుంటే సినిమా ఆటోమెటిగ్గా సక్సెస్ ని సాధిస్తుందనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

నిజానికి కథ విషయంలో క్లారిటీగా ఉంటే మేకింగ్ విషయంలో కొంచెం తడబడిన కూడా ప్రేక్షకులు దాన్ని అడ్జస్ట్ అవుతూ కథ బాగుంది కాబట్టి సినిమాని సక్సెస్ఫుల్గా నిలుపుతుంటారు. మేకింగ్ ఎంత బాగా చేసినా కూడా కథ లేకపోతే సినిమాలో విషయం లేదని ప్రేక్షకుడు ఆ సినిమాను తీసిపారేస్తూ ఉంటాడు. అందువల్లే సినిమాకి కథే ముఖ్యం కంటెంట్ లేని సినిమా ఏది కూడా ప్రేక్షకులను మెప్పించలేదనేది వాస్తవం. అందుకోసం కంటెంట్ మీద దర్శక నిర్మాతలు సైతం చాలా వరకు కసరత్తులు చేసి ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...

Tags:    

Similar News