స్క్రీన్ మీద దర్శకుడి సిగ్నేచర్ పడాలి... మూవీ చూడగానే డైరెక్టర్ పేరు చెప్పాలంటే ఏం చేయాలి...

ఆ తర్వాత తన మేకింగ్ విషయంలో తన సినిమాకి ఎలాంటి కలర్ ప్యాలెట్ ఉండాలి. కరక్టరైజేషన్స్ లో వేరియేషన్స్ ను ఎలా చూపించాలి. నటినటుల ఎంపిక ఎలా ఉండాలి.

Update: 2026-09-28 05:30 GMT

చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ఒక సినిమా చూడగానే పలానా దర్శకుడి సినిమానే అనేంతలా ప్రేక్షకుడిలో వాళ్ళకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు... నిజానికి ఒక దర్శకుడు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటి ఏర్పడుతుంది. ప్రేక్షకుడు సినిమా మధ్యలో వచ్చి చూసినా కూడా ఇది పలానా దర్శకుడి సినిమా అని ఎలా గుర్తుపడతాడు అనే విషయంలో కొద్ది రోజులుగా చాలామందిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి కథను ఎంచుకునే దగ్గర నుంచి దర్శకుడి యొక్క టేస్ట్ అనేది ఏర్పడిపోతుంది. ఆ కథలో ఆ దర్శకుడికి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఇష్టమో ఆ కథని ఆ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుకుంటాడు.

ఆ తర్వాత తన మేకింగ్ విషయంలో తన సినిమాకి ఎలాంటి కలర్ ప్యాలెట్ ఉండాలి. కరక్టరైజేషన్స్ లో వేరియేషన్స్ ను ఎలా చూపించాలి. నటినటుల ఎంపిక ఎలా ఉండాలి. ఆ నటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలి. సినిమాకి సంబంధించిన విజువల్స్ ఏ రేంజ్ లో ఉండాలి. ప్రేక్షకులందరిని మ్యాజిక్ చేయగలిగే మ్యూజిక్ తో కూడా దర్శకుడి యొక్క టేస్ట్ అనేది తెలిసిపోతుంది. అలాగే వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ కూడా క్రియేట్ అవుతుంది. సబ్ టెక్స్ట్ ద్వారా కూడా కొన్ని సీన్స్ ను కన్వే చేయగలిగితే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఉదాహరణకి ఫ్రేమ్స్, షాడోస్, వస్తువుల ద్వారా సీన్ లోని డెప్త్ ను చూపించడం. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల సినిమాల్లో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి... ఇలా తమకంటూ ఓన్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళ సినిమాలను చూడడానికి చాలామంది జనాలు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఆ స్టైల్ ప్రేక్షకులకు నచ్చుతుంది. దానివల్ల ప్రేక్షకులు వాళ్లు సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం రాజమౌళి కూడా తనకంటూ ఒక ఓన్ స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఆయన సినిమాల్లో ఎలివేషన్స్, ఎమోషన్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అది రాజమౌళికి సంబంధించిన సినిమా అనేది ఈజీగా చెప్పవచ్చు. ప్రశాంత్ నీల్ సినిమాలైతే చాలా డార్క్ షేడ్ లో ఉంటాయి. ఆ స్క్రీన్ మీద బొమ్మ పడగానే ఇది ప్రశాంత్ నీల్ సినిమా అని మనం ఈజీగా చెప్పొచ్చు... అలాగే శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఓదెల ఇలా ఒక్కో దర్శకుడు తమ సినిమాని తమ పేరు వాడకుండా కూడా ప్రేక్షకుడు కనిపెట్టేలా తమ కంటూ ఒక స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు...

Tags:    

Similar News