ఆడియన్స్ పూరి జగన్నాధ్ హీరోలను మిస్ అవుతున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో సినిమాలను చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్... ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

Update: 2026-09-28 10:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో సినిమాలను చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్... ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక విలన్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్లు మనం ఇప్పటివరకు ఏ సినిమాలో చూసి ఉండము. అలాంటి రీతిలో విలన్స్ ప్రవర్తిస్తూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ లో కేవలం క్యారెక్టరైజేషన్స్ మీదనే సినిమాను నడిపించగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ మాత్రమే అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... నిజానికి ఆయన సినిమాల్లో హీరోలకి కొంచెం తిక్క ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పిన వినరు వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ ఆ హీరో కి మాత్రమే సెట్ అవుతుంది. ఇప్పుడు టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న స్టార్ హీరోలందరితో సినిమాలను చేసి అందరికీ సక్సెస్ లను అందించిన ఘనత పూరి జగన్నాథ్ కి మాత్రమే దక్కింది. ప్రస్తుతం ఆయన ఈ మధ్య కాలంలో కొంతవరకు తడబడినప్పటికి విజయ్ సేతుపతి ని హీరోగా పెట్టి చేసిన 'స్లమ్ డాగ్' సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంటే మాత్రం ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నావాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా కూడా ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్లు ఆయన చేసిన సినిమాలు ఇప్పటికి మన నిత్యజీవితంలో ప్రతి ఒక్కరు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

పూరి జగన్నాథ్ హీరోలు చెప్పిన డైలాగులు మన రొటీన్ లైఫ్ లో సిచువేషన్ కి తగ్గట్టుగా ఎవరికి వాళ్లు వాడుకుంటూ ఉంటారు. మన రొటీన్ లైఫ్ లో భాగమై పోయిన పూరి జగన్నాథ్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. మరి అలాంటి దర్శకుడు మరోసారి కంబ్యాక్ ఇచ్చి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం...

Tags:    

Similar News