థియేటర్లపై పెద్దన్నల మైండ్ గేమ్!
నైజాంలోను పెద్ద సినిమాలకు వచ్చిన కలెక్షన్ లెక్కల్లో తేడాలు చూపించేందుకు ఆస్కారం ఉందని విశ్లేషించారు.;
ఈరోజుల్లో మనుగడ పోరాటానికి ఇంటెలెక్చువల్ క్వాలిటీ చాలా ముఖ్యం. మైండ్ గేమ్ ఆడటంలో నైపుణ్యం ఎదగడానికి, ముందడుగు వేయడానికి సహకరిస్తోంది. చదరంగంలో ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేయడంలో, పాము - నిచ్చెనల ఆటలో పాము మింగేయకుండా, నిచ్చెనలు ఎక్కే సామర్థ్యం చాలా చాలా అవసరం.
అలాంటి ఆట ఆడటంలో రాటు దేలిన కొందరు సినీపరిశ్రమ దిగ్గజాలు ఇప్పుడు చోటా మోటా ఎగ్జిబిటర్లపై మైండ్ గేమ్ ఆడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు బడా ఎగ్జిబిటర్లు థియేటర్లను అద్దె విధానం నుంచి పర్సంటేజ్ షేరింగ్ విధానంలోకి తేవాలని గట్టి పంతం పడుతున్నారని తెలిసింది. దీనికి కారణం ఏపీలోని కృష్ణ, తూర్పు, సీడెడ్ లో నెలకొన్న ఉత్సాహం...అలాగే నైజాంలోను పర్సంటేజ్ విధానానికి అనుకుల పరిస్థితులు ఉన్నాయని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారట.
మారిన పరిస్థితులపై చర్చించేందుకు ఈనెల 18న ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగుకి తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఎటెండవుతున్నారు. చాలా మంది సింగిల్ థియేటర్ యజమానులు, నిర్మాతలు పర్సంటేజ్ షేరింగ్ మోడల్ ని వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ల రంగం క్రైసిస్ లో ఉంది. పెద్ద సినిమాల విషయంలో కోట్లలో నష్టపోవాల్సి ఉంటుంది.
నైజాంలోను పెద్ద సినిమాలకు వచ్చిన కలెక్షన్ లెక్కల్లో తేడాలు చూపించేందుకు ఆస్కారం ఉందని విశ్లేషించారు. ఇప్పటికే థియేటర్లు రెండు వారాల తర్వాత షేరింగ్‌కు మారుతున్నాయని ప్రధాన విడుదలలకు మాత్రమే అద్దె ప్రాతిపదికన రిలీజ్ చేయాలని కోరుతున్నామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. అయితే ఎగ్జిబిషన్ రంగంలో ఒంటెద్దు పోకడలకు పోకుండా, ఇరు పక్షాలకు కలిసొచ్చేలా ఒక కొత్త విధానాన్ని ఆలోచిస్తారేమో చూడాలి.