12 ప‌రిశ్ర‌మ‌లు ఒకేతాటిపైకి సాధ్య‌మేనా?

తెలుగు సినిమా( ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాట‌కు)_కు ప్ర‌ఖ్యాత ఆస్కార్ అవార్డు వ‌రించిన‌ప్పుడు ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు విషెస్ చెప్పాయి? అంటే స‌మాధానం ఉండ‌దు.;

Update: 2025-12-21 13:30 GMT

దేశంలో మొత్తం 12 చిత్ర ప‌రిశ్ర‌మ‌లు యాక్టివ్ గా ఉన్నాయి. ఆ ప‌రిశ్ర‌మ‌లన్నిటి నుంచి ఏటా క్ర‌మం త‌ప్ప‌కుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లు అంటే తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం ప‌రిశ్ర‌మ‌లుగా చెప్పుకుంటాం. ఉత్త‌రాదిన అంటే ప్ర‌ముఖంగా బాలీవుడ్ పేరు వినిపిస్తుంది. మ‌రాఠీ, బోజ్ పురీ, ఒడియా స‌హా మ‌రికొన్ని ప‌రిశ్ర‌మ‌ల నుంచి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎక్కువ‌గా హిందీ సినిమాలే దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమ‌స్ అన్న సంగ‌తి తెలిసిందే. మ‌రాఠీ , బోజ్ పురి నుంచి రిలీజ్ అవుతున్న సినిమాల‌కు మంచి గుర్తింపు ఉంటుంది.

హిందీ సినిమాలు సౌత్ లో రీమేక్ అవ్వ‌డం..ఇక్క‌డ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వ‌డం చూస్తుంటాం. ఈ మ‌ధ్య కాలంలో? ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల న‌టులు కూడా న‌చ్చిన భాష‌లోకి వ‌చ్చి సినిమాలు చేయ‌డం ప‌రిపాటిగా మారింది. వివిధ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన నిర్మాత‌లు కూడా భాగ‌స్వామ్యం అవుతున్నారు. ఇంత వ‌ర‌కూ ప‌రిశ్ర‌మ‌ల మ‌ధ్య ఐక్య‌త బాగానే క‌నిపిస్తుంది. కానీ ఇదంతా చూస్తున్న‌ప్పుడ‌ల్లా ఇదంతా బిజినెస్ కోణంలోనే జ‌రుగుతోంది అన్న‌ది కాద‌న‌లేని నిజం. అన్ని భాష‌లు..ప‌రిశ్ర‌మ‌లు ఒక‌దానికి కొక‌టి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రించుకుంటేనే అస‌లైన ఐక్య‌త అన్న దానికి మాత్రం తావు లేన‌ట్లే క‌నిపిస్తుంది.

తెలుగు సినిమా( ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాట‌కు)_కు ప్ర‌ఖ్యాత ఆస్కార్ అవార్డు వ‌రించిన‌ప్పుడు ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు విషెస్ చెప్పాయి? అంటే స‌మాధానం ఉండ‌దు. బాలీవుడ్ నుంచి ...కోలీవుడ్ నుంచి ఓ ఇద్ద‌రు ముగ్గురు స్టార్లు త‌ప్ప‌! మిగ‌తా ఎవ‌రూ స్పందించ‌లేదు. భార‌తీయ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌పంచ సినిమా వేదిక‌పై ఓ గుర్తింపు ద‌క్కింది? అన్న సంతోషాన్ని ఏ ప‌రిశ్ర‌మ వ్య‌క్తం చేయ‌లేదు. కొంత మంది అయితే ఆపాట‌కు అవార్డు ఏంటి? అంటూ హేళ‌న‌గా పోస్టులు పెట్టారు. వాటిని ఖండించ‌క‌పోగా మౌనం వ‌హించ‌డంతో? ఆ మౌనాన్ని టాలీవుడ్ అర్ధాంగీకారంగా భావిం చాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక ప‌క్క‌నే ఉన్నా కోలీవుడ్ అయితే? తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే? థియేట‌ర్లు దొర‌క‌కుండా రాజ‌కీ యాల‌కు తెర తీస్తుంది. అక్క‌డ‌ తెలుగు న‌టుల‌కు, టెక్నిషియ‌న్ల‌కు అవ‌కాశాలైతే రానే రావు. క‌న్న‌డ‌లో అయితే? తెలుగు సినిమా పోస్ట‌ర్ క‌నిపిస్తేనే చించేస్తారు లేదంటే పేడ‌ వేస్తారు. తెలుగు సినిమాకు ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లోనే ఆ రెండు ప‌రిశ్ర‌మ‌ల నుంచి ఎదురైన గొప్ప అవ‌మాన‌మ‌ది. ఇలా ఎన్ని కుటిల రాజ‌కీయాలు చేసినా? ఏనాడు తెలుగు సినిమా పరాయి సినిమాల‌ను త‌క్కువ చేయ‌లేదు. సినిమా న‌చ్చిందంటే న‌టీన‌టుల‌తో, భాష‌తో సంబంధం లేకుండా ఆద‌రించారు. అంత‌ర్గ‌తంగా ఎన్ని విబేధాలున్నా? దాన్ని మీడియా ముందుకు తీసుకురాలేదు. సినిమాని నెగిటివ్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ దేశంలో 12 ప‌రిశ్ర‌మ‌ల్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ఇండియన్ నేష‌న‌ల్ సినీ అకాడ‌మీ చేస్తోంది. భార‌తీయ సినీ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌య‌త్నిస్తుందని సంస్థ ప్ర‌తినిధులు చెబుతున్నారు. దీన్ని ఓ మంచి ప్ర‌య‌త్నంగా చెప్పొచ్చు. మ‌రి ఈ ప్రపోజ‌ల్ని ఆయా ప‌రిశ్ర మ‌లు ఎలా తీసుకుంటాయి? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News