సంక్రాంతి చిత్రాలు.. ఇప్పుడే అసలు పరీక్ష..
2026 సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి ఊపొచ్చిందని చెప్పాలి.;
2026 సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ కు మంచి ఊపొచ్చిందని చెప్పాలి. ఒకేసారి ఐదు చిత్రాలు విడుదల కావడం, థియేటర్లు తక్కువగా ఉండడం వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పండుగ వాతావరణంలో ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చారు. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా టాలీవుడ్ చిత్రాలు వారం రోజుల పాటు ఆధిపత్యం కొనసాగించాయి.
అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పాటు ఫస్ట్ వీకెండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దీంతో నేడు అంటే సోమవారం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. స్కూల్స్ ప్రారంభమయ్యాయి. ఎంప్లాయిస్ వారి వారి ఆఫీసులకు వెళ్లిపోయారు. దీంతో కచ్చితంగా థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గుతుంది. తద్వారా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోవడం సాధారణ విషయమే.
కానీ వీక్ డేస్ లో కూడా థియేటర్స్ లో సరైన ఆక్యుపెన్సీ కొనసాగితేనే సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడగలుగుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని చిత్రాలకు అసలు పరీక్ష అని చెప్పాలి. వర్కింగ్ డేస్ ప్రారంభం కానుండటంతో ఐదు సినిమాలు.. ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలకు వీక్ డే పరీక్ష ఎదురైంది.
నిజానికి సంక్రాంతి చిత్రాల్లో మూడు సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి మంచి టాక్ అందుకున్నాయి. తొలి వీకెండ్ లో మంచి వసూళ్లు సాధించాయి. మన శంకర వరప్రసాద్ అయితే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మిగతా అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి సినిమాలకు మాత్రం రెండో వారం కీలకమే. సాలిడ్ వసూళ్లు రాబడితే సేఫ్ జోన్ లోకి వస్తాయి.
అదే సమయంలో రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు తొలుత మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయని చెప్పాలి. ఆ రెండు సినిమాల మౌత్ టాక్ అంతగా అనుకూలంగా లేకపోవడంతో వసూళ్లు తగ్గాయి. కానీ ఇప్పుడు వీక్ డేస్ లో మినిమమ్ కలెక్షన్స్ సాధిస్తేనే.. టార్గెట్ లో కాస్త అయినా రికవరీ అయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే వర్కింగ్ డేస్ అన్ని సినిమాలకు అసలైన పరీక్షగా మారనుంది. పండుగ వసూళ్లు, తొలి వీకెండ్ కలెక్షన్లు ఎంత ఉన్నా, వీక్ డేస్ లో నిలబడిన సినిమాలే చివరకు విజేతలుగా నిలుస్తాయని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరేం జరగనుందో.. వీక్ డేస్ లో ఏ సినిమా ఎంత మొత్తంలో వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.