హోస్ట్ గా తేజ సజ్జ.. తుపాకీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ట్రైటర్స్ షో సీక్రెట్స్!
ఈ ప్రాజెక్ట్ కు తాను చాలా స్పీడ్ గా ఓకే చెప్పానని తేజ సజ్జ వివరించాడు. తన కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ గా అంగీకరించిన ప్రాజెక్ట్ ఇదేనని తెలిపాడు.
హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న తేజ సజ్జ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ మీద హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న గ్లోబల్ రియాలిటీ షో 'ది ట్రైటర్స్' తెలుగు వెర్షన్ కు ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను Tupaki.com కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తేజ సజ్జ, అమెజాన్ ప్రైమ్ సౌత్ హెడ్ పద్మ రివిల్ చేశారు.
ది ట్రైటర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా పాతికేళ్లకు పైగా భాషల్లో సక్సెస్ అయిన ఒక ఇంటర్నేషనల్ ఫార్మాట్ అని పద్మ తెలిపారు. గతేడాది హిందీలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఇక్కడి ఆడియన్స్ కోసం సిద్ధం చేశామన్నారు. మన సంస్కృతికి తగినట్లుగా కాస్త మిస్టరీ, సెటైర్ జోడించి కేవలం అడాప్టేషన్ లా కాకుండా పక్కా లోకలైజ్డ్ వెర్షన్ లా దీన్ని డిజైన్ చేసినట్లు ఆమె చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ కు తాను చాలా స్పీడ్ గా ఓకే చెప్పానని తేజ సజ్జ వివరించాడు. తన కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ గా అంగీకరించిన ప్రాజెక్ట్ ఇదేనని తెలిపాడు. హిందీలో కరణ్ జోహార్ చేసిన వెర్షన్ చూసిన వెంటనే తనకు ఫార్మాట్ బాగా కనెక్ట్ అయిపోయిందని చెప్పాడు. ఒక ఇంట్లో కొంతమందిని పెట్టి వాళ్ల రియాక్షన్స్ చూడటం కాకుండా, రెండు టీమ్స్ గా విడిపోయి మైండ్ గేమ్ ఆడే కాన్సెప్ట్ కాబట్టే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశాడు.
ఈ షోలో హోస్ట్ గా తాను ఒక సరికొత్త క్యారెక్టర్ ప్లే చేశానని తేజ అన్నాడు. బయట చాలా సరదాగా ఉండే తాను, ఇందులో మాత్రం నవ్వకుండా చాలా సీరియస్ గా ఉండే పాత్రలో కనిపిస్తానని చెప్పాడు. షోలో ఉన్న ఇరవై మంది కంటెస్టెంట్లలో చాలామంది తనకు పర్సనల్ గా తెలిసినా కూడా, ఆ క్యారెక్టర్ లో ఉంటూ వాళ్ళతో గేమ్ ఆడించడం ఒక ఛాలెంజింగ్ ఎక్స్ పీరియన్స్ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇంటర్నేషనల్ ఫార్మాట్ కావడంతో షోలో మేజర్ మార్పులు చేయలేదని, కానీ తెలుగు ఆడియన్స్ కోసం కొన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ యాడ్ చేసినట్లు తేజ వెల్లడించాడు. తానొచ్చి ఏదో చెప్పేసి వెళ్లకుండా, సందర్భానుసారంగా సామెతలు వాడటం లాంటివి చేశామన్నాడు. ఇక కంటెస్టెంట్ల ఎంపికలోనూ భిన్న రంగాలకు చెందిన వారిని తీసుకున్నామని, డాక్టర్లు, సింగర్లు, కొరియోగ్రాఫర్లతో కలిపి ఒక ఫ్రెష్ ఫ్లేవర్ ఇవ్వబోతున్నట్లు టీమ్ తెలిపింది.
అక్టోబర్ 15న ఈ షో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఒకేసారి మూడు ఎపిసోడ్లు రిలీజ్ చేస్తామని, ఆ మూడు కలిపి చూస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందని తేజ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ మీద తనకో ఐపీ బిల్డ్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నాడు. ఇక ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో కింద ఉన్న లింక్ లో చూడొచ్చు.