జెన్ Z వాళ్లకు తేజనే సూపర్ స్టారా?

ఎందుకంటే.. జెన్ జెడ్ 1997 నుంచి కాగా.. జస్ట్ కాస్త ముందు 1995లో పుట్టారు తేజ. 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు.;

Update: 2025-09-17 16:48 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వరుసగా రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన హీరోల్లో ఒకరిగా నిలిచారు. రీసెంట్ గా మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ.. సినిమాలో తన నటనతో మెప్పించారు. సూపర్ యోధగా అలరించారు. యాక్షన్ సీన్స్ లో కంప్లీట్ గా జీవించేశారు.

అలా మిరాయ్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో. ఇప్పటికే హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న తేజ.. ఇప్పుడు మరోసారి మిరాయ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. తన అప్ కమింగ్ మూవీస్ పై కూడా అందరి ఫోకస్ పడేలా చేశారు తేజ సజ్జా.

అయితే ఇప్పుడు ఆ యంగ్ హీరో.. జెన్ జెడ్ వాళ్లకు సూపర్ స్టార్ అని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా 1997-2012 మధ్య సంవత్సరాల్లో పుట్టిన వాళ్లకు జెన్ జెడ్ కింద పరిగణిస్తుంటారు. ఈ రోజుకు15-28 వయసులో ఉన్న వాళ్లకు తేజనే సూపర్ స్టార్ అని చెబుతున్నారు.

ఎందుకంటే.. జెన్ జెడ్ 1997 నుంచి కాగా.. జస్ట్ కాస్త ముందు 1995లో పుట్టారు తేజ. 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి 2006 వరకు అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు. తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

మళ్లీ 2019లో సమంత ఓ బేబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయం అందుకున్నారు. అక్కడికి రెండేళ్ల తర్వాత జాంబీ రెడ్డి మూవీతో హీరోగా మారి మరో హిట్ ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ ను దక్కించుకుని పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

రూ.100 కోట్ల క్లబ్ లో హనుమాన్ తో అడుగుపెట్టిన తేజ సజ్జా.. ఇప్పుడు మళ్లీ మిరాయ్ తో ఆ ఫీట్ అందుకున్నారు. అలా జెన్ జెడ్ యూత్ కు చిన్నప్పటి నుంచి తేజ అలరిస్తూనే ఉన్నారు. ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన ఆయన.. మధ్యలో గ్యాప్ తీసుకుని ఇప్పుడు లీడ్ రోల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అందుకే జెన్ జెడ్ యూత్ కు తేజ సజ్జా సూపర్ స్టారేనని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News