• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షూటింగ్ స్పాట్ లో కొండ‌పై...

షూటింగ్ స్పాట్ లో కొండ‌పై నుంచి జారిప‌డిన న‌టి!

| బాలీవుడ్ న‌టి తానీషా ముఖ‌ర్జీ సుపరిచిత‌మే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన `కంత్రి` సినిమాలో సెకెండ్ లీడ్ పోషించింది.

By - Tupaki Desk
Update: 2024-04-19 05:37 GMT

బాలీవుడ్ న‌టి తానీషా ముఖ‌ర్జీ సుపరిచిత‌మే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టించిన `కంత్రి` సినిమాలో సెకెండ్ లీడ్ పోషించింది. తెలుగులో న‌టించింది ఈ ఒక్క చిత్రంలోనే. త‌మిళ్..హిందీ కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇప్ప‌టికీ అక్క‌డ యాక్టివ్ గానే ప‌నిచేస్తోంది. బిగ్ బాస్ సీజ‌న్ -7లోనూ పాల్గొంది. అయితే సినిమాల మీద త‌న‌కున్న మ‌క్కువ‌తో ఏకంగా బ్రెయిన్ డెడ్ అయింద‌నే విష‌యాన్ని సైతం దాచి పెట్టింద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. అదేంటో ఆమె మాట‌ల్లోనే..

`నా మొదటి సినిమా ‘ష్’ షూటింగ్ లో భాగంగా ఓ ఎత్తైన కొండపై సీన్ చిత్రీకరిస్తున్నారని.. ఆ సమయంలో నేను ఆ ఎత్తైన కొండపై నుంచి జారి కింద ప‌డ్డాను. ఆ సమయంలో నా తలకు బలమైన గాయమైంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని అన్నారు. సంవత్సరం పాటు చికిత్స కోసం ఆసుప‌త్రుల చుట్టూ తిరిగాను. మ‌ళ్లీ మామూలు స్థితికి రావడానికి ఏడాది పట్టింది. అయితే అప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. అదే మొదటి సినిమా కాబట్టి.. చెప్తే ఎక్కడ న‌న్ను సినిమాలోంచి తొలగిస్తారో అన్న భయంతో బ్రెయిన్ డ్యామేజ్ విషయాన్ని దాచిపెట్టాను.

ఆ గాయంతో బాధపడుతూనే షూటింగ్ లో పాల్గొనేదాన్ని. రెండు గంటలు షూట్ జరిగితే మూడు గంటలు రెస్ట్ తీసుకునేదాన్ని. బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్ గా ఉండలేకపోయేదాన్ని. ఆస‌మ‌యంలో నిర్మాత‌లు ఎంతో స‌హ‌క‌రిచారు కాబ‌ట్టే ఆ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. కానీ ప్రమాదం తర్వాత మునుప‌టి లా షూటింగ్ చేయ‌లేక పోయేదాన్ని . ఆ పాత్ర‌కు అందుకే పూర్తిగా న్యాయం చేయ‌లేక‌పోయాను. బరువు కూడా పెరిగాను. సినిమాలో కొన్ని చోట్ల ఎక్స్ ప్రెషన్స్ వేగంగా పలికించలేక‌పోయాను.

అందుకే నాకు యాక్టింగ్ రాదు అని విమ‌ర్శలు వ‌చ్చాయి. ఆ విమర్శ‌ల్ని కొట్టిపారేయ‌ను. ఎందుకంటే న‌టిగా మొద‌లైన త‌ర్వాత నా వ్య‌క్తిగ‌త విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు అన‌వ‌స‌ర‌మైన‌వి. పైగా నా స‌మ‌స్య కూడా వాళ్ల‌కు చెప్ప‌లేదు కాబ‌ట్టి విమ‌ర్శ‌ల్ని అంగీక‌రించాను` అని తెలిపింది. ప్ర‌స్తుతం తానీషా `ల‌వ్ యూ శంక‌ర్` అనే సినిమాలో న‌టిస్తోంది. అలాగే హిందీలో టీవీ షోల‌ను అమ్మ‌డు హోస్ట్ చేస్తోంది.

Tags:    
  • Tanishaamukerji 
  • Actress 
  • Bollywood 
  • Filmindustry 
  • Shooting 
  • Braindead 
  • Kanthrimovie 
  • Bigboss7 

Similar News

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS