• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాధాకృష్ణ ప్రపంచంలో...

రాధాకృష్ణ ప్రపంచంలో తమన్నా పరువాల ప్రేమ

| తాజాగా తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో రాధారాణి గెటప్ లో అదిరిపోయే లుక్స్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-08-23 04:38 GMT

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం తన ప్రస్థానం కొనసాగించిన అందాల భామ తమన్నా భాటియా. ఈ అమ్మడు శ్రీ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత హ్యాపీడేస్ సినిమాతో నటిగా మొదటి సక్సెస్ అందుకుంది. రామ్ చరణ్ కి జోడీగా నటించిన రచ్చ, 100% లవ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ వస్తోంది.

 

తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 ఏళ్ళకి పైగా అయ్యింది. ఇన్నేళ్ళ కెరియర్ లో ఎన్నో మరిచిపోలేని పాత్రలని తమన్నా చేసింది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కూడా తమన్నా నటించి మెప్పించింది. బాహుబలి సినిమాలో తమన్నా క్యారెక్టర్ ఓ వైపు గ్లామర్ టచ్ తో నడుస్తూనే వారియర్ క్వీన్ తరహాలో ఉంటుంది. సై రా నరసింహారెడ్డి సినిమాలో తమన్నా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

 

ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన తమన్నా నాలుగు వెబ్ సిరీస్ లలో నటించింది. తమన్నా రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోషూట్ లతో సందడి చేస్తూ ఉంటుంది. అదిరిపోయే వెస్ట్రన్, ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లతో తమన్నా ఎప్పటికప్పుడు అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా తమన్నా ఇన్ స్టాగ్రామ్ లో రాధారాణి గెటప్ లో అదిరిపోయే లుక్స్ తో ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఇది ఒక క్యాంపైన్ కోసం చేసిన స్పెషల్ షూట్ అని తమన్నా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది.

 

దాంతో పాటు మరో ఇంటరెస్టింగ్ విషయాన్ని కూడా తమన్నా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. నా 18 ఏళ్ల కెరీర్‌లో నేను చేసిన అత్యుత్తమ క్యాంపైన్ లలో ఇది ఒకటని కచ్చితంగా చెబుతాను. ఈ క్యాంపైన్ ఫోటోషూట్ లో నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు ఓ రకమైన శాంతిని ఆస్వాదించారు. ప్రతి షూట్ ని చాలా ఇష్టంతోనే నేను చేస్తాను. అయితే ఇది మాత్రం చాలా ప్రత్యేకం. మండిపోతున్న ఎండలో విపరీతమైన వేడి ఉన్నప్పటికి కూడా ప్రశాంతమైన సమయాన్ని అనుభావించాము.

 

 

షూట్ చేస్తున్న సమయంలో నీడతో పాటు కొంత చల్లదనం కూడా ఉంది. ఇదంతా చూస్తుంటే సాక్షాత్తు విశ్వం మాకు మార్గనిర్దేశం చేసినట్లు అనిపించింది. రాధ పాత్రలో నటిస్తున్నప్పుడు ఏదో తెలియని అతీతమైన స్థితికి లోనయ్యాను. దాని వెనుక కచ్చితంగా దైవ శక్తి ఉన్నట్లు అనిపిస్తోంది. మేము చేసిన ఈ క్యాంపైన్ లో కచ్చితంగా అందరికి దైవత్వం కనిపిస్తూ ఉంటుంది.

 

 

ఈ విజువల్స్ వెనుక ఉన్న ఉన్న కరణ్ తొరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న. ఈ ఫోటోషూట్ తో ఎంతో అద్భుతమైన కథని అతను చెప్పాడు. నేను పని చేసిన బెస్ట్ డిజైనర్ లలో అతను కూడా ఒకరని తమన్నా భాటియా స్టొరీలో రాసుకొచ్చింది. దీనిని బట్టి ఈ ఫోటోషూట్ ని తమన్నా ఎంతగా ఆస్వాదించిందో అర్ధం చేసుకోవచ్చు. ఫోటోలలో కూడా తమన్నా రాధాగా అద్భుతమైన సౌందర్యంతో మెస్మరైజ్ చేస్తూ ఉండటం విశేషం.

Tags:    
  • Tamannabhatia 
  • Radhakrishna 
  • Phototalk 
  • Tollywood 
  • Bollywood 
  • Glamorouslooks 
  • Sociallooks 
  • Trendingclicks 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS