హీరోయిన్స్ నిజంగానే ఆ మందులు వాడుతారా...?

బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌... ఇలా ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్న హీరోయిన్స్‌ చాలా మంది సన్నగా నాజూకుగా కనిపిస్తూ ఉంటారు.;

Update: 2025-11-11 11:30 GMT

బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌... ఇలా ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్న హీరోయిన్స్‌ చాలా మంది సన్నగా నాజూకుగా కనిపిస్తూ ఉంటారు. అతి తక్కువ మంది మాత్రమే హీరోయిన్స్ లావుగా కనిపిస్తూ ఉంటారు. సాధారణంగా బరువు ఎక్కువ ఉన్న హీరోయిన్స్‌కి ఇండస్ట్రీలో గుర్తింపు తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా స్టార్‌ హీరోయిన్స్ వారిని దూరంగా పెడుతూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు మాత్రమే బరువు ఎక్కువ ఉన్న హీరోయిన్స్‌ను తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ చాలా ప్రత్యేక శ్రద్దను కనబర్చుతూ ఉన్నారు. హీరోయిన్‌ అంటే సన్నగా ఉండాల్సిందే అనే ఒక రూల్‌ను అనధికారికంగా తీసుకు వచ్చారు. అందుకే దాదాపు అందరు హీరోయిన్స్‌ జీరో సైతం కోసం ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అనేది వాస్తవం.

హీరోయిన్స్‌ బరువు తగ్గడం కోసం...

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌ బరువు తగ్గడం కోసం ఏకంగా ఆపరేషన్‌లు చేయించుకుంటున్నారు అనే పుకార్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా చాలా మంది హీరోయిన్స్ ముందస్తు జాగ్రత్తగా బరువు పెరగకుండా మందులు వాడుతున్నారు అనేది కొందరి వాదన. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్‌లో ముఖ్యంగా మూడు పదుల వయసు దాటిన హీరోయిన్స్‌లో కొద్ది మంది మందులు వాడుతూ బరువు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు అనేది చాలా మంది అభిప్రాయం. కొందరి పేర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. సౌత్‌ సినిమాలతో పరిచయం అయ్యి, బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఈ మధ్య కాలంలో ఆ ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆమె అభిమానులు తమన్నాను నేచురల్‌ బ్యూటీ అంటారు. కానీ కొందరు సోషల్‌ మీడియాలో మాత్రం పుకార్లు పుట్టిస్తున్నారు.

తమన్నా విషయంలో మీడియాలో పుకార్లు..

సన్నగా ఉండటం కోసం మందులు వాడుతున్నారు అంటూ వస్తున్న పుకార్లపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఒక నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు బరువు పెరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా, మందులు వాడుతూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారా, మందులు వాడటం ద్వారా బరువు పెరగకుండా ఉంటున్నారా అన్నట్లుగా ప్రశ్నించారు. అందుకు తమన్నా కాస్త ఘాటుగానే స్పందించింది. తనను గత ఇరవై ఏళ్లుగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. నాకు 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నాలో వచ్చిన మార్పును ఎప్పటికప్పుడు ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడూ మార్పు వచ్చినా అది సహజ సిద్దంగానే తప్ప నేను ఎప్పుడూ ప్రత్యేకంగా మార్పులు చేయించుకున్నది లేదు అన్నట్లుగా తమన్నా చెప్పుకొచ్చింది. తాను ప్రతి విషయంలోనూ సహజంగానే ఉండేందుకు ప్రయత్నిస్తాను అంది.

బరువు పెరగడం పై తమన్నా క్లారిటీ

బరువు పెరగడం, తగ్గడం అనేది ఆడవారి వయసును బట్టి మారుతూ ఉంటుంది. ప్రతి అయిదు సంవత్సరాలకు మహిళల్లో మార్పు కనిపిస్తూ ఉంటుందని, దాన్ని సహజ సిద్దంగానే తాను స్వీకరించాను అంది. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా మంది నా గురించి చాలా ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే నేను ఎప్పుడూ ఏ విధమైన చికిత్స తీసుకోలేదు. ముఖ్యంగా నేను ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే ఇలా మంచి ఫిజిక్‌ తో ఉన్నాను. వర్కౌట్‌ చేయడం, డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్ప మరే ఇతర మందులు లేవు అంటూ తమన్నా క్లారిటీ ఇచ్చింది. ఇంకా చాలా మంది విషయంలోనూ ఇలాంటి పుకార్లు షికార్లు చేశాయి. కనుక వాటికి సంబంధించినంత వరకు ఆ హీరోయిన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. తమన్నా చెప్పిన దాని ప్రకారం హీరోయిన్స్‌ బరువు తగ్గడం కోసం మందులు వాడరు. మరి ఈ విషయాన్ని ఎంత వరకు జనాలు నమ్ముతారు అనేది చూడాలి.

Tags:    

Similar News