పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్
అదే ఇంటర్వ్యూలో ఆఫర్లు లేకపోవడం వల్లే చిన్న సినిమాల్లో నటిస్తున్నారా అనే ప్రశ్నకు కూడా తమన్నా సమాధానమిచ్చింది.;
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి మూవీ లవర్స్ కు స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ పలు భాషల్లో నటించి ఆడియన్స్ ను అలరించి వారికి చేరువైన తమన్నా ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది. మొన్నామధ్య రజినీకాంత్ జైలర్ మూవీలో కావాలయ్యా సాంగ్ చేసి తమన్నా అదరగొట్టిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత స్త్రీ2 లో ఆజ్ కీ రాత్ అంటూ మరోసారి ఆడియన్స్ ను అలరించిన తమన్నా, తాజాగా అజయ్ దేవగణ్‌తో కలిసి రైడ్2 లో మరో స్పెషల్ సాంగ్ చేసింది. ఐటెం సాంగ్స్ చేసీ చేసీ వాటిపై బోర్ కొట్టేసిన తమన్నా ఇప్పుడు రూట్ మార్చి అఘోరా పాత్ర చేసింది. ఓదెల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా వస్తున్న ఓదెల2 సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటించింది.
ఏప్రిల్ 17న రిలీజ్ కానున్న ఈ సినిమాలో తమన్నా శివ శక్తి గా కనిపించనుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న తమన్నాకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. పెళ్లి ఎప్పుడు అని తమన్నాని అడగ్గా ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చింది. తమన్నా కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
కానీ ఏం జరిగిందో తెలియదు కానీ కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిపోయారని, వీరి ప్రేమ బ్రేక్ అయిందని బాలీవుడ్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అటు తమన్నా కానీ, ఇటు విజయ్ వర్మ కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. ఇలాంటి టైమ్ లో తమన్నా పెళ్లి గురించి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విజయ్ వర్మతో బ్రేకప్ అయినందుకు తమన్నా అలా అనిందా లేదా అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేక తమన్నా అలా మాట్లాడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అదే ఇంటర్వ్యూలో ఆఫర్లు లేకపోవడం వల్లే చిన్న సినిమాల్లో నటిస్తున్నారా అనే ప్రశ్నకు కూడా తమన్నా సమాధానమిచ్చింది. తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది లేదని, కంటెంట్ బావున్న సినిమా పెద్ద సినిమాగా నిలుస్తుందని, లేకపోతే చిన్న సినిమా అవుతుందని తమన్నా తెలిపింది. హీరోయిన్లు ఇప్పటివరకు పోలీసులుగా, డాక్టర్లుగా, కొత్త కొత్త పాత్రల్లో కనిపించారు కానీ శివ శక్తిగా ఎవరూ కనిపించలేదని, ఈ అవకాశం రావడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తమన్నా వెల్లడించింది.