రాజమౌళి లాగానే కొడుకు కూడా డిఫరెంటే..
హైదరాబాద్ నగరంలో దోమల బెడద తీవ్రమైంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రాంతంతో సంబంధం లేకుండా దోమలు తెగ విజృంభిస్తున్నాయి.;
హైదరాబాద్ నగరంలో దోమల బెడద తీవ్రమైంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రాంతంతో సంబంధం లేకుండా దోమలు తెగ విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల నివారణకు ఎన్ని మార్గాలు వెతుకుతున్నా అవి మాత్రం మమ్మల్ని ఎవడ్రా ఆపేది అనే తీరులో ప్రవర్తిస్తూ ప్రజలను తెగ ఇబ్బంది పెడుతున్నాయి.
రాజమౌళి కొడుకుగా కార్తికేయకు ప్రత్యేక గుర్తింపు
దీంతో చేసేదేమీ లేక ప్రజలు కూడా వాటితో దండయాత్ర చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ ప్రముఖ సెలబ్రిటీ కాస్త సెటైరికల్ గా వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతను మరెవరో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ. రాజమౌళి కొడుకుగానే కాకుండా కార్తికేయకు ప్రత్యేక గుర్తింపు ఉందనే విషయం తెలిసిందే.
దోమల బెడదపై కార్తికేయ సెటైరికల్ వీడియో
ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్ వర్క్స్ లో బిజీగా ఉన్న కార్తికేయ, మిడ్ నైట్ జరుగుతున్న షూటింగ్ లో ఈ దోమలు తమ చిత్ర యూనిట్ ను ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో తెలియచేస్తూ ఓ వీడియోను కాస్త వ్యంగ్యంగానే షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తికేయ షూట్ చేసిన వీడియో బాగా వెలుతురు ఉన్న ప్రాంతం కావడంతో దోమలు అక్కడ గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించాయి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. హైదరాబాద్ లో మనుషుల కంటే దోమలే ఎక్కువగా ఉంటాయని కొందరంటుంటే, మరికొందరు రాజమౌళి సినిమాలోని విలన్ కంటే ఈ దోమలే భయంకరంగా ఉన్నాయని, ఇంకొందరైతే మీలాంటి వాళ్లు కాస్త చొరవ తీసుకుని ప్రభుత్వం వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్తే బావుంటుందని మున్సిపల్ ఆఫీసర్లను, ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, హైదరాబాద్ లో దోమల బెడద బాగా ఎక్కువైందనే విషయాన్ని రాజమౌళి లాగానే అతని కొడుకు కూడా చాలా కొత్తగా, డిఫరెంట్ గా చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో గురించి సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతున్నాయి.