సీనియర్ న‌టి లేటు వ‌య‌సు ఘాటు ఫోజు

భార‌తీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన టబు తన అద్భుతమైన నటనాభిన‌యంతో ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నారు.;

Update: 2025-06-04 04:27 GMT

భార‌తీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ నటీమణులలో ఒకరైన టబు తన అద్భుతమైన నటనాభిన‌యంతో ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నారు. జాతీయ ఉత్త‌మ న‌టిగా నాలుగు ద‌శాబ్ధాల కెరీర్ ర‌న్ తో టబు ఎంద‌రికో స్ఫూర్తి. ఇటు దక్షిణాది, అటు ఉత్త‌రాదినా ట‌బు పాపులారిటీ అసాధార‌ణ‌మైన‌ది.


నిన్నే పెళ్లాడుతా, అంద‌రివాడు, చాందిని బార్, హైదర్ స‌హా చాలా చిత్రాల్లో ట‌బు అత్యుత్త‌మ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స్వీయ-నిర్మిత ఆర్టిస్టుగా త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైన‌ది. ట‌బు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రశంసలు అందుకున్నారు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోను చెప్పుకోద‌గ్గ పాత్ర‌ల్లో న‌టించింది. ఇంత‌కుముందు ఆస్కార్ విన్నింగ్ మూవీ `లైఫ్ ఆఫ్ పై` (ఆంగ్ లీ ద‌ర్శ‌కుడు) స‌హా ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన ట‌బు ఇప్పుడు మ‌రోసారి హాలీవుడ్ చిత్రంలో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇటీవ‌ల డూన్ - ప్రొఫెసీ చిత్రంలో ట‌బు మెరుపు లాంటి న‌ట‌న‌కు గొప్ప పేరొచ్చింది.


మ‌రోసారి ట‌బు హాలీవుడ్ లో న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ఫిలింఫేర్ మ్యాగ‌జైన్ తో ట‌బు ముచ్చ‌టించారు. త‌న కెరీర్ పై శాశ్వ‌త ప్ర‌భావం చూపిన ద‌ర్శ‌కుల‌కు ట‌బు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న కెరీర్ లో గుల్జార్ సాబ్ త‌న‌కు స‌హ‌జంగా న‌టించే అవ‌కాశం క‌ల్పించార‌ని ట‌బు ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. నన్ను నేను వ్యక్తపరచుకోవడంలో గుల్జార్, విశాల్ భ‌ర‌ద్వాజ్ వంటి ద‌ర్శ‌కులు స్వేచ్ఛ ఇచ్చార‌ని ట‌బు తెలిపారు. #మక్బూల్ తో విశాల్ భరద్వాజ్ సినిమా, చిత్రనిర్మాణం, నటనకు చాలా భిన్నమైన విధానాన్ని నాకు పరిచయం చేశారు. ఈ వ్యక్తులు భారీ ప్రభావాన్ని చూపుతారు. వారు మీరు పనిచేసే విధానంలో.. ముఖ్యంగా ఎదిగే చిన్న వయస్సులో ఉన్నప్పుడు న‌టీన‌టుల్లో చాలా మారుస్తారు. వారు శాశ్వత ముద్ర వేస్తారు.. అని టబు వ్యాఖ్యానించారు.


ప్ర‌స్తుతం ఫిలింఫేర్ క‌వ‌ర్ పేజీపై ట‌బు ఫోజ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. లేటు వ‌య‌సులో ట‌బు ఘాటు ఫోజు గురించి అభిమానులు మ‌చ్చ‌టించుకుంటున్నారు. షెల్డన్ శాంటోస్ ఈ క‌వ‌ర్ ఫోటో షూట్‌ని షూట్ చేసారు.

Tags:    

Similar News