• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇన్నాళ్ళకు పవర్ఫుల్ లైనప్...

ఇన్నాళ్ళకు పవర్ఫుల్ లైనప్ లో సూర్య

| కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్టర్ సూర్య

By - Tupaki Desk
Update: 2023-08-23 04:08 GMT

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యాక్టర్ సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్, తర్వాత తెలుగులో ఎక్కువ ఫేమ్ ఉన్న కోలీవుడ్ స్టార్ అంటే సూర్య అని చెప్పాలి. అతని మూవీ తమిళంలో హిట్ అయితే తెలుగులో కూడా కచ్చితంగా హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది. సూర్య నుంచి చివరిగా వచ్చిన సూరరైపోట్రు ఆకాశం నీ హద్దురాగా తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

జై భీమ్ సినిమా అయితే తమిళంలో ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలియదు కానీ తెలుగు ఆడియన్స్ ని బాగా నచ్చేసింది. అయితే ఈ రెండు సినిమాలో ఓటీటీలో రిలీజ్ కావడంతో వాటి సక్సెస్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేకపోయారు. తరువాత పాండిరాజ్ దర్శకత్వంలో చేసిన ET ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్ లో కంగువ మూవీ చేస్తున్నారు.

దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అలాగే వెట్రిమారన్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రోలెక్స్ పాత్రతో ఒక సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కనుంది. అలాగే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో ఒక సూపర్ పవర్స్ తో మైథలాజికల్ ఫిక్షన్ మూవీ ఒకటి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా నెక్స్ట్ చేయబోయే సినిమాలు అన్ని కూడా ఒకదానికి మించి మరొకటి అనే విధంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ లైన్ అప్ చూస్తుంటే పాన్ లెవల్ లో సూర్య తనని తాను గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే విక్రమ్ తో కమల్ హాసన్, జైలర్ తో రజినీకాంత్, ఇప్పుడు లియోతో విజయ్ పాన్ ఇండియా ఇమేజ్ లోకి వచ్చారు. ఇక సూర్య కూడా తన నెక్స్ట్ లైన్ అప్ సినిమాలతో ఈ జాబితాలోకి కోలీవుడ్ నుంచి రాబోతున్నాడని గట్టిగా చెప్పొచ్చు.

Tags:    
  • Suriya 
  • Jaibheem 
  • Kanguvafilm 
  • Vetrimaaran 
  • Sudhakongara 
  • Suriyarolex 
  • Lokeshkanagaraj 
  • Kollywoodstarhero 
  • Herosuriya 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS