• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య బర్త్ డే సర్ప్...

సూర్య బర్త్ డే సర్ప్ ప్రైజ్.. వ్వాటే గ్లింప్స్

| కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఎలాంటి క్రేజ్ అండ్ మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-07-23 07:01 GMT

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఎలాంటి క్రేజ్ అండ్ మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు లైన్ లో పెడుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. కంగ అనే ఓ పరాక్రముడి కథతో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సూర్య ఆరు గెటప్స్ లో కనిపిస్తారని సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే ఆ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు అభిమానులు నెట్టింట ఆయనకు విష్ చేస్తున్నారు. అదే సమయంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 44 మూవీ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపింది. అదిరిపోయే సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న మూవీ నుంచి గ్లింప్స్ ను రీసెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

సముద్రాన్ని చూపిస్తూ స్టార్ట్ అయిన గ్లింప్స్.. మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగింది. కొందరు హీరో కోసం వెయిట్ చేస్తుంటారు. అదే సమయంలో సూర్య సిగరెట్ తాగుతూ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు ఒక గ్యాంగ్ ఉంది. చివర్లలో చేతిలో తుపాకీ.. నోట్లో సిగరెట్.. చిన్న స్మైల్ తో సూర్య ఉన్న సీన్ తో ముగించారు మేకర్స్. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే ఈజీగా తెలుస్తుంది.

అయితే సూర్య.. చిన్న గెడ్డంతో రగ్డ్ అవతార్ లో అదరగొట్టారు. పవర్ ప్యాక్డ్ రోల్ లో కనిపించారు. రజినీకాంత్ బాషా రేంజ్ లో నడుస్తూ సందడి చేశారు. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ టచ్ కూడా ఇచ్చారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కల్కితో ఇటీవల ఆడియన్స్ ను ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ లో ఉంది. ఓవరాల్ గా గ్లింప్స్ సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది.

సినిమాపై అంచనాలు కూడా పెంచుతుంది. సూర్య సరసన హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటిస్తోంది. జోజు జార్జ్‌, జయరామ్‌ తోపాటు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జ్యోతిక, సూర్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Happy Birthday @Suriya_offl Sir
From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl

— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024
Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Kanguva 
  • Suriya 
  • HappyBirthdaySuriya 
  • BirthdayWishesSuriya 
  • PoojaHegde 
  • JojuGeorge 
  • Karunakaran 
  • Jayaram 
  • KarthikSubbaraj 
  • SantoshNarayana 
  • Jyothika 
  • 2DEntertainments 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS