మరో టాలీవుడ్ డైరెక్టర్ కు సూర్య ఛాన్స్ ఇస్తారా?
ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ తో పని చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.;
ప్రస్తుతం ఇతర భాషల హీరోలందరూ తెలుగు భాషపై ఫోకస్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ తెలుగులో సినిమాలు చేయడానికి, తెలుగు డైరెక్టర్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఎక్కువగా ఈ విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ సినిమా చేయగా, దళపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు చేశారు. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ సర్ మూవీ చేయగా, ఇప్పుడు అదే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉన్న సూర్య ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ తో పని చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
సూర్యకు కథ చెప్పిన వివేక్ ఆత్రేయ
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తన తర్వాతి సినిమాను సూర్య తో చేయడానికి డిస్కషన్స్ చేస్తున్నారని, రీసెంట్ గా వివేక్ సూర్యను కలిసి స్టోరీ నెరేషన్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ, సరిపోదా శనివారం లాంటి విభిన్న సినిమాలకు దర్శకత్వం వహించి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఇప్పుడు కోలీవుడ్ హీరో సూర్యతో సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
గతంలో సూపర్ స్టార్ కు కూడా..
వివేక్ చెప్పిన కథ సూర్యకు నచ్చిందని, ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి సూర్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు ఏదీ ఫిక్స్ అవలేదు. సూర్య నుంచి ఫైనల్ డెసిషన్ ఎప్పుడొస్తుందా అని వివేక్ ఎదురుచూస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే వివేక్ ఆత్రయే సూర్య కంటే ముందు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా ఓ కథ చెప్పారని గతంలో వార్తలొచ్చాయి కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు.
ఇక సూర్య విషయానికొస్తే ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమాతో బిజీగా ఉన్న అతను, గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు. ఈసారి ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని వెంకీ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్య, మరో టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి.