అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి.. ఏం జరుగుతోంది?

సంధ్య థియేటర్ ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆ కేసులో చర్యలు జరిగాయని ఊహాగానాలు వైరల్ అయ్యాయి.;

Update: 2026-03-07 10:54 GMT

పుష్ప 2 మూవీ విడుదల సమయంలో హైదరాబాద్‌ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని సోషల్ మీడియాలో రూమర్లు చక్కర్లు కొట్టాయి.

సంధ్య థియేటర్ ఘటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఆ కేసులో చర్యలు జరిగాయని ఊహాగానాలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఆ ఘటనకు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ఎవరిపైనా ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుని చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ కూడా ఆ అంశంపై పెద్దగా వ్యాఖ్యలు చేయలేదు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన విషయాల్లో చట్ట ప్రక్రియ ఎలా ఉంటే అలాగే కొనసాగుతుందని, తాను కూడా చట్టాన్ని గౌరవిస్తానని మాత్రమే ఆయన తెలిపారు. దీంతో ఆ విషయం కొంతకాలం చర్చల్లోనే కొనసాగింది.

అయితే ఇటీవల జరిగిన అల్లు ఫ్యామిలీ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య కనిపించిన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేదికపై ఇద్దరూ పలుమార్లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, క్లోజ్ గా మాట్లాడుకోవడం అక్కడికి వచ్చిన అతిథుల దృష్టిని ఆకర్షించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వేడుకలో ఇద్దరూ పలుమార్లు కలిసి మాట్లాడుకోవడం, నవ్వుతూ సంభాషించడం అక్కడి అతిథుల దృష్టిని ఆకర్షించిందని సమాచారం. సాధారణంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కలిసి కనిపించే సందర్భాలు ఉంటాయి. కానీ ఇంత ఆప్యాయతతో వ్యవహరించడం మాత్రం అరుదుగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి మధ్య కనిపించిన సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షించిందని అంటున్నారు.

దీంతో గతంలో వినిపించిన విభేదాల ప్రచారం నిజం కాదేమో అన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సినీ వర్గాల్లో కూడా అదే అంశంపై చర్చ నడుస్తోంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత వచ్చిన వార్తలతో పోలిస్తే వేడుకలో కనిపించిన ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పూర్తిగా భిన్నంగా ఉందని పలువురు అంటున్నారు. ఏదేమైనా అల్లు శిరీష్ వివాహ వేడుకలో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ మధ్య కనిపించిన బాండింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News