యష్ 'టాక్సిక్'.. రిస్క్ తప్పించుకోవాలంటే..

అయితే టాక్సిక్ మూవీ.. యష్ కెరీర్‌ లోనే అత్యంత హై బడ్జెట్ ప్రాజెక్ట్‌ గా నిలిచినట్లు తెలుస్తోంది.;

Update: 2026-03-07 11:30 GMT

స్టార్ హీరో యష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. మాస్ ఎలిమెంట్స్‌, భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఆ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అంచనాలు పెరిగాయి. గీతా మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 19వ తేదీన సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా, మేకర్స్ పలు కారణాల వల్ల వాయిదా వేశారు.

అయితే టాక్సిక్ మూవీ.. యష్ కెరీర్‌ లోనే అత్యంత హై బడ్జెట్ ప్రాజెక్ట్‌ గా నిలిచినట్లు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యూనరేషన్లు, భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రమోషన్ ఖర్చులు ఇలా అన్నీ కలిపి సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించినట్లు సమాచారం. ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండటంతో థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు.

తెలుగు హక్కులకు గాను సుమారు రూ.120 కోట్లకు ఒప్పందం కుదిరింది. అయితే ఇది అడ్వాన్స్ రూపంలో ఇచ్చి కమిషన్ బేస్‌ పై విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మాత్రం నిర్మాతలే స్వయంగా సినిమాను విడుదల చేయనున్నారు. తమిళనాడులో కూడా మూవీకి మంచి డిమాండ్ కనిపించడంతో ఏరియాల వారీగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు హక్కులను సొంతం చేసుకున్నారు.

కేరళలో కూడా సినిమాను భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్కడ దాదాపు 350 నుంచి 400 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ మార్కెట్‌ లో సినిమాకు భారీ ధర పలికింది. విదేశీ హక్కులు సుమారు రూ.105 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

ఏదేమైనా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ.500 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.600 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. గ్రాస్ కలెక్షన్ల పరంగా చూస్తే దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రావాల్సి ఉంటుంది. అంతటి రేంజ్ లో వసూళ్లు సాధించడమంటే మామూలు విషయం కాదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే ఆ రేంజ్ లో వసూళ్లు వస్తాయి. దానికి తోడు థియేట్రికల్ ఒప్పందాల్లో చాలా వరకు రిఫండబుల్ డీల్స్ ఉన్నాయని సమాచారం. అంటే సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో రాకపోతే నిర్మాతలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వకపోతే పెద్ద రిస్కే. దీంతో టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News