ఎమోషన్ ఫీల్ అవ‌కపోతే రీచెక్ చేసుకోవాల్సిందే!

రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ లభించినప్పటికీ, దర్శకురాలిగా వరలక్ష్మి చూపించిన ప్రతిభపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.;

Update: 2026-03-07 14:16 GMT

తమిళ నటి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నటిగా ఇప్పటికే తన ప్రతిభను చాటుకున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు సంపాదించిన ఆమె ఇప్పుడు దర్శకురాలిగా కూడా కొత్త అడుగు వేసింది. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఎస్. సరస్వతి. ఈ సినిమాను ఆమె కేవలం డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో కీలక పాత్రలో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎస్‌. స‌ర‌స్వ‌తికి మిక్డ్స్ రెస్పాన్స్

రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ లభించినప్పటికీ, దర్శకురాలిగా వరలక్ష్మి చూపించిన ప్రతిభపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా కథను చెప్పే విధానం, భావోద్వేగాలను ప్రదర్శించే తీరు, సన్నివేశాల నిర్మాణంలో ఆమె చూపిన పట్టుదల సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. దీంతో వరలక్ష్మి నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా కూడా మంచి భవిష్యత్తు ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

చిన్న సినిమానే కానీ స్ట్రాంగ్ ఎమోష‌న్

రీసెంట్ గా చిత్ర యూనిట్ ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వహించ‌గా, అందులో వరలక్ష్మి భర్త నికోల‌య్ స‌చ్‌దేవ్ మాట్లాడిన మాటలు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఆయన మాట్లాడుతూ ఎస్. సరస్వతి సినిమా రూ.800 లేదా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కాదని, ఇదొక చిన్న సినిమా అని, ఓ చిన్న మ‌హిళ తీసిన సినిమా అని, కానీ ఇందులో ఉన్న ఎమోష‌న్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంద‌ని తెలిపారు.

ఈ మూవీ ఆడియ‌న్స్ మనసులను తప్పకుండా కదిలిస్తుందని నికోల‌య్ విశ్వాసం వ్యక్తం చేశారు. సినిమా చూసిన తర్వాత మీలో ఎలాంటి భావోద్వేగం కలగకపోతే, మీ గుండెను ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఏదో ఆఫ్ అయి ఉండొచ్చ‌ని ఆయన చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ఈ సినిమా సాధారణ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించే విధంగా రూపొందించబడిందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని, ఇందులో ఉన్న సందేశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని నికోల‌య్ పేర్కొన్నారు.

Tags:    

Similar News