'ఫౌజీ' షూటింగ్ క్లైమాక్స్ కే చేరుకుందా?

షాడో పోస్ట‌ర్ లో ప్రభాస్ నీడ చుట్టూ రకరకాల తుపాకులు ఉన్న పోస్టర్ భారీ యాక్షన్ ఉండబోతుందని హింట్ ఇచ్చింది.;

Update: 2026-03-07 14:20 GMT

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య `పౌజీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింది? అన్న దానిపై ఇంత వ‌ర‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. కానీ సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్నారు. మ‌రి ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ సంగ‌తేంటి? ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నిర‌కాల ప్ర‌చార చిత్రాలు రిలీజ్ అయ్యాయంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

`ఫౌజీ` అధికారికంగా 2024, ఆగస్టు 17న గ్రాండ్‌గా ప్రారంభమైంది. అటుపై సినిమా రెగ్యులర్ షూటింగ్ అదే ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో తమిళనాడులోని కారైకుడిలో మొదలైంది. అప్ప‌టి నుంచి షూటింగ్ ద‌శ‌లోనే ఉంది. అంటే దాదాపు 17 నెల‌లుగా సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. మ‌రి షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యిందంటే? చిత్ర‌ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం న‌ల‌భై రోజుల షూటింగ్ మిన‌హా అంతా పూర్త‌యిన‌ట్లు తెలిసింది. దీంతో చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ చేరుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమ‌యంలో సందీప్ రెడ్డి వంగా ద‌ర్వ‌క‌త్వంలో `స్పిరిట్` చిత్రం షూటింగ్ కూడా ప్రారంభ‌మైంది.

దీంతో `పౌజీ` కి ప్ర‌భాస్ పూర్తి స్థాయిలో అటెండ్ అవ్వ‌డం లేదు. రెండు సినిమా షూటింగ్ లను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఆ కార‌ణంగా `పౌజీ` షూటింగ్ వేగం త‌గ్గింది. `పౌజీ` నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలేంటి అంటే? గత ఏడాది ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న `ఫౌజీ` టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ప్రభాస్ ఇంటెన్సివ్ లుక్‌లో, వెనుక బ్రిటిష్ జెండా కాలిపోతుండగా కనిపిస్తాడు. ఆయన ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు ఈ పోస్టర్ లో రివీల్ చేసారు. అయితే ఈ టైటిల్ ప్రకటనకు ముందే కొన్ని కాన్సెప్ట్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేశారు.

షాడో పోస్ట‌ర్ లో ప్రభాస్ నీడ చుట్టూ రకరకాల తుపాకులు ఉన్న పోస్టర్ భారీ యాక్షన్ ఉండబోతుందని హింట్ ఇచ్చింది. అలాగే సంస్కృత శ్లోకాలతో కూడిన పోస్టర్ మ‌రో పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు.ఈ సినిమాకు పురాణాలకు సంబంధం ఉందని సూచిస్తూ సంస్కృత శ్లోకాలు ఉన్న పోస్టర్లను వదిలారు.అటుపై ప్రధాన తారాగణాన్ని పరిచయం చేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. త‌దుప‌రి `ఫౌజీ` నుంచి రిలీజ్ గ్లింప్స్ రిలీజ్ కానున్నాయి. అటుపై టీజ‌ర్, ట్రైల‌ర్ ఒక్కొక్క‌టిగా ప్రేక్ష‌కాభిమానుల్ని థ్రిల్ చేయ‌నున్నాయి.

Tags:    

Similar News