ధురంధర్ 2.. తొలి తెలుగు హీరోగా అడివి శేష్!

పాన్ ఇండియా మార్కెట్‌ లో పెద్ద సినిమాలు విడుదలకు వస్తున్న సమయంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తమ రిలీజ్ డేట్లు మార్చుకోవడం సాధారణమే.;

Update: 2026-03-07 12:30 GMT

పాన్ ఇండియా మార్కెట్‌ లో పెద్ద సినిమాలు విడుదలకు వస్తున్న సమయంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు తమ రిలీజ్ డేట్లు మార్చుకోవడం సాధారణమే. తాజాగా ఇదే పరిస్థితి ఎదురవడంతో టాలీవుడ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమా విడుదల తేదీని మార్చినట్టు స్పష్టం చేశారు. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో థియేటర్లు దొరకకపోవడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం డెకాయిట్ మొదటగా మార్చి 19న విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ధురంధర్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హిందీ మార్కెట్‌ లో ఎక్కువ థియేటర్లు ఆ సినిమాకే కేటాయించే పరిస్థితి నెలకొంది. అంతే కాదు ఆ మూవీపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీంతో తమ సినిమాకు సరైన సంఖ్యలో స్క్రీన్లు దొరకడం కష్టమవుతుందని అర్థమయ్యాక.. డెకాయిట్ టీమ్ విడుదల తేదీని మార్చాలని నిర్ణయించింది. ఆ విషయాన్ని శేష్ స్వయంగా తెలిపారు. ఏప్రిల్ 10న డెకాయిట్ రిలీజ్ కానున్నట్లు చెప్పారు. పెద్ద సినిమాలు విడుదలకు వచ్చినప్పుడు థియేటర్ల విషయంలో పోటీ పెరగడం ఇండస్ట్రీలో సహజమని చెప్పారు.

ముఖ్యంగా హిందీ బెల్ట్‌ లో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమాలు వస్తే చిన్న చిత్రాలకు స్క్రీన్లు దొరకడం కష్టం అవుతుందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు సరైన అవకాశం దక్కేలా విడుదల తేదీ మార్చడం మంచిదని భావించామని వెల్లడించారు. పెద్ద సినిమా ప్రెషర్ కారణంగా తన సినిమా రిలీజ్ డేట్ మార్చుకున్న తొలి తెలుగు హీరోగా తాను నిలిచానని నవ్వుతూ పేర్కొన్నారు.

సినిమా బాగా విడుదల కావాలంటే సరైన టైమింగ్ కూడా అవసరమని చెప్పారు. ఇక డెకాయిట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అడివి శేష్ ఇప్పటికే చేసిన సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ గా రూపొందడంతో డెకాయిట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

మరోవైపు, ధురంధర్ 2 భారీ అంచనాలతో రూపొందుతున్న సీక్వెల్ కావడంతో హిందీ మార్కెట్‌ లో పెద్ద ఎత్తున విడుదల అవుతోంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో థియేటర్ల కేటాయింపులో ఆ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యం దక్కే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన రిలీజ్ డేట్ ఎంచుకోవడం ఏ సినిమాకు అయినా కీలకం. అందుకే డెకాయిట్ టీమ్ తొందరపడకుండా చిన్న గ్యాప్ తీసుకుని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించింది.

Tags:    

Similar News