• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  25 ఏళ్లయినా ఇంకా...

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

| ప్రియాంక చోప్రా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ 9 ఏళ్ల వయసులోని ఫొటోతో పాటు 17 ఏళ్లకు మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నప్పటి ఫొటోను షేర్ చేశారు. చిన్నప్పుడు తల్లి బాయ్‌కట్ చేయించారని గుర్తుచేసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత కూడా జీవితాన్ని అర్థం చేసుకుంటూనే ఉన్నానని, ప్రతి ఒక్కరూ తమ గతాన్ని ప్రేమించాలని సూచించారు. త్వరలో ‘వారణాసి’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-15 07:32 GMT

బాలీవుడ్ టూ హాలీవుడ్ ప్రియాంక చోప్రా ఎలా ఎదింగ‌ద‌న్నది చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ‌క్ఔండ్ లేకుండానే కెరీర్ ప్రారంభించి అంచ‌లంచెలుగా శిఖ‌రానికి చేరుకుంది. హాలీవుడ్ అనే ఆలోచ‌న పీసీకి లేనే లేదు. కానీ బాలీవుడ్ ఇచ్చిన గుర్తింపుతోనే ఆ స్థాయికి చేరుకుంద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం అన్న‌ది పీసీలో గొప్ప ల‌క్ష‌ణం. తానో పెద్ద హాలీవుడ్ స్టార్ ని అన్న అహం భావం ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌దు. ఎంతో సింపుల్ గా ఉంటుంది. అలాగే అమ్మ‌డు నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా చిన్న నాటి జ్ఞాపకాలకు సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేసింది. 9 ఏళ్ల వయసులో అల్లరి రోజుల ఫోటోను..అలాగే 17 ఏళ్ల వయసులో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్నప్పటి ఫోటోను ఒకే ఫ్రేమ్‌లో ఉంచి పోస్ట్ చేశారు. చిన్నతనంలో స్కూల్‌లో ఇబ్బంది కాకూడదని తల్లి మధు చోప్రా తనకు బాయ్ కట్ చేయించారని.. క‌టోరి కట్ నుండి ఆ హెయిర్‌కట్ వైపు మారడం తనకు అప్పట్లో పెద్ద విజయంగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. పబ్లిసిటీ, మేకప్, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆ చిన్నారి దశ నుంచి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టే వరకు తనలో వచ్చిన మార్పు ఎంతో ఆశ్చర్యకరంగా ఉందని పీసీ పేర్కొన్నారు.

`దయచేసి నా 9 ఏళ్ల చిన్ననాటి రూపాన్ని ఎవరూ ట్రోల్ చేయకండి` అంటూ ప్రియాంక ముందుగానే సరదాగా చిన్న హెచ్చరిక కూడా జత చేశారు. టీనేజ్ వయసులో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న సమయంలో తనలో కలిగిన భావాలను .. పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ మాటల్లో వర్ణించారు. `నేను అమ్మాయిని కాను. ఇంకా పూర్తిగా మహిళనూ కాలేదు` అనే భావనే అప్పట్లో తనలో ఉండేదని మనసులోని మాటను బయటపెట్టారు.

25 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా జీవితాన్ని అర్థం చేసుకుంటూనే ఉన్నాన‌న్నారు.త‌న‌లాగే ప్ర‌తీ ఒక్క‌రూ జీవితంలో ఇలాంటి ద‌శ‌ను చూసే ఉంటార‌ని గుర్తు చేసారు. `మనం ఈరోజు ఏ స్థానంలో ఉన్నామంటే దానికి చిన్ననాటి స్వయంకృషే కారణమని.. ప్రతి ఒక్కరూ గతాన్ని ప్రేమించాలని పిలుపునిచ్చారు. ఇక ప్రియాంక చోప్రా సినిమాల విష‌యానికి వ‌స్తే టాలీవుడ్ లో `వార‌ణాసి` సినిమాతో లాంచ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు మ‌హేష్‌కు జోడీగా అల‌రించ‌నుంది. 120 దేశాల్లో రిలీజ్ అవుతున్న సినిమా విజ‌యం సాధిస్తే పీసీ ఇమేజ్ హాలీవుడ్ లో అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

Tags:    
  • priyankachopra 
  • missindia 
  • childhoodphotos 
  • throwbackphotos 
  • priyankachoprajonas 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS