• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పని పోతుందనే భయంతో...

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

| నటి స్వరా భాస్కర్ 2011లో మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో పని కోల్పోతాననే భయంతో 56 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను భరించానని తెలిపారు. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తనకు అండగా నిలిచి రక్షణ కల్పించారని గుర్తుచేసుకున్నారు.

By - Srikanth Kontham
Update: 2026-11-15 09:38 GMT

ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంశం నిత్యం తెర‌పైకి వ‌స్తూనే ఉంటుంది. అవ‌కాశాల పేరిట లైంగిక దోపీడీ ఎలా? జ‌రుగుతుంద‌ని ఏదో న‌టి తెర‌పైకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఇలాంటి విష‌యాలపై ఓపెన్ అవ్వాలంటే? ఎన్నో విష‌యాలు ఆలోచించేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. జ‌రిగిన అన్యాయం గురించి మీడియా ముందుకొచ్చి దైర్యంగా మాట్లాడుతున్నారు. న‌వ‌త‌రం న‌టీమ‌ణులు త‌మలా దోపీడీల‌కు గురి కాకూడ‌ద‌ని ముందు గానే అలెర్ట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా స్వరా భాస్కర్ ఉదంతం తెర‌పైకి వ‌చ్చింది.

కెరీర్ ఆరంభంలో స్వ‌రా భాస్కర్ ఎదుర్కొన్న‌ ఇబ్బందులపై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. 2011లో జరిగిన ఓ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ చేతిలో స్వ‌ర‌ లైంగిక వేధింపులకు గురయ్యానని వెల్లడించారు. ఈ ఘటన అప్పట్లో తనను మానసికంగా ఎంతగానో కృంగదీసింద‌ని వాపోయారు. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీలో ఈ ఘటన జ‌రిగింద‌న్నారు. `అప్పుడు నా వయసు ఇరవైల్లోనే ఉంది. ఓ సినిమా విజయంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకంటూ ఎలాంటి పీఆర్ టీమ్.. సపోర్ట్ సిస్టమ్ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు లేకపోవడం వల్ల బలహీనమైన స్థితిలో ఉన్నానన్నారు.

ఎవరి సహాయం కోరాలో తెలియని పరిస్థితిని డైరెక్టర్ అనుకూలంగా మలుచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ సమయంలో దర్శకుడు తనతో ఎలాంటి శారీరక స్పర్శకు పాల్పడకపోవడం వల్లే ఆ వర్క్‌ప్లేస్ హ్యరాస్‌మెంట్ కిందకు వస్తుందని మొదట్లో గుర్తించలేకపోయానని తెలిపారు. కాలక్రమేణా `మీటూ` ఉద్యమం వచ్చిన తర్వాత ఇతర మహిళలు ఎదుర్కొన్న అనుభవాలను విన్నప్పుడే అప్పట్లో తాను ఎదుర్కొన్నది అచ్చమైన లైంగిక వేధింపు అని అర్థమైందన్నారు.

శారీరక దాడి జరగకపోతే అది వేధింపు కాదనే అపోహ‌లో తాను కూడా కొంతకాలం ఉన్నానన్నారు. మ‌రి వేధింపుల వల్ల సినిమా మధ్యలోనే వదిలేయాలనే ఆలోచన ఎందుకు రాలేద‌నే ప్ర‌శ్నకు ఏమ‌న్నారంటే? అప్పట్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనే తపన బలంగా ఉండేదని చెప్పుకొచ్చారు. 56 రోజుల పాటు సాగిన‌ షెడ్యూల్‌లో కొన్ని రోజుల్లోనే వేధింపులు ఎదురై పని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఆ భారాన్ని భరించానని తెలిపారు.

అయితే ఆ సమయంలో ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండగా నిలిచారని స్వరా గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ ప్రవర్తన గురించి ఎగ్జిక్యూటివ్‌కు చెప్పిన వెంటనే తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించారని తెలిపారు. ఇప్పుడు అత‌నే త‌న మేనేజ‌ర్ గా ప‌ని చేస్తున్నార‌ని స్వ‌రా తెలిపారు.

Tags:    
  • swarabhasker 
  • castingcouch 
  • s*xualharassment 
  • metoo 
  • bollywood 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS