• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాత కష్టాలతోనే...

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

| 'గోట్' నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి సినిమా నిర్మాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. బడ్జెట్ పెరగడం, బ్లాక్‌మెయిల్, దర్శకుడి మార్పు, నెగిటివ్ ప్రచారం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ అనుభవాల ఆధారంగా 'నిర్మాత' పేరుతో సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. దీనికి వేదవ్యాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. సుడిగాలి సుధీర్‌నే 'గోట్' అసలు హీరో అని స్పష్టం చేశారు.

By - M Prashanth
Update: 2026-11-15 05:28 GMT

సినిమా నిర్మాణంలో హీరోలు, దర్శకులు, నిర్మాతల మధ్య అభిప్రాయభేదాలు రావడం కొత్తేమీ కాదు. కానీ కొన్నిసార్లు ఆ గొడవలు షూటింగ్ ఆగిపోయే వరకు వెళ్తుంటాయి. అలాంటి సమయంలో పెట్టుబడి పెట్టిన నిర్మాత పరిస్థితి ఏంటనేది పెద్దగా బయటకు రాదు. ఇప్పుడు సుడిగాలి సుధీర్ 'గోట్' నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. అంతేకాదు, ఆ అనుభవాలతోనే మరో సినిమా తీస్తానని ప్రకటించారు.

నవంబర్ 12న విడుదలైన 'గోట్' సక్సెస్ మీట్‌లో చంద్రశేఖర్ రెడ్డి పలు విషయాలు వెల్లడించారు. మొదట్లో కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని, అయితే కొందరి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. సినిమా మొదలయ్యే ముందు ఒకలా మాట్లాడి, షూటింగ్ ప్రారంభమైన రెండు వారాల తర్వాత బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితులు కూడా ఉంటున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తమ మొదటి యూనిట్‌లో పనిచేసిన కొందరిని ఉద్దేశించి చేసినవేనని తెలిపారు.

ముఖ్యంగా సినిమా బడ్జెట్ గురించి ఓ ఉదాహరణ చెప్పారు. ఒక పాటకు రూ.10 నుంచి 12 లక్షలు కేటాయిస్తే, తాను ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఏకంగా రూ.38 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. గతంలో మంచు మనోజ్ ఓ పాట కోసం రూ.30 నుంచి 40 లక్షలు ఖర్చవుతుందని చెప్పగా, నిర్మాత దగ్గర రూ.10 లక్షలే ఉన్నాయని మోహన్ బాబు సూచించడంతో అదే బడ్జెట్‌లో పూర్తి చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. అప్పటి నటులకు నిర్మాతల పరిస్థితిపై అవగాహన ఉండేదని, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి పెద్దలు నిర్మాతల కోసం ఎంతో కష్టపడేవారని చెప్పారు.

ఇలాంటి అనుభవాల ఆధారంగా 'నిర్మాత' పేరుతో సినిమా చేస్తానని చంద్రశేఖర్ ప్రకటించారు. ఇప్పటివరకు హీరోలు, దర్శకుల కష్టాలపై సినిమాలు వచ్చాయని, సొంత డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత ఎదుర్కొనే సమస్యలను కూడా చూపించాలనుకుంటున్నట్లు చెప్పారు. 'గోట్' నిర్మాణంలో మధ్యలో దర్శకుడి మార్పు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వేదవ్యాస్ సినిమా పూర్తి చేశారు. ఇప్పుడు 'నిర్మాత' చిత్రానికి కూడా వేదవ్యాస్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కాలేదు.

మరోవైపు తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తుల పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదనే ప్రశ్నకు కూడా నిర్మాత సమాధానం ఇచ్చారు. ఇది సక్సెస్ మీట్ కావడంతో సినిమా విడుదలకు సహకరించినవారిని గుర్తుచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తర్వాత ఒక్కో మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి, పేర్లతో సహా అన్ని విషయాలు చెబుతానని ప్రకటించారు.

సినిమా విడుదలకు ముందే నెగిటివ్ ప్రచారం జరిగిందని చంద్రశేఖర్ మరో ఆరోపణ చేశారు. నవంబర్ 12న సినిమా విడుదలైతే, 11వ తేదీ సాయంత్రమే ఐమాక్స్ దగ్గర పబ్లిక్ టాక్ పేరుతో వీడియోలు వచ్చాయని చెప్పారు. అప్పటికి షోలు కూడా పడలేదని, అయినా సినిమా బాగోలేదంటూ వీడియోలు పెట్టారని ఆరోపించారు. కొందరు కావాలనే డబ్బులు ఖర్చు చేసి ఇలాంటి ప్రచారం చేయించారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇక సుడిగాలి సుధీర్ గురించి కూడా చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో చాలామంది హీరోలున్నారని తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. సుధీరే అసలు హీరో అని, సినిమా పూర్తవడానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ హీరోలుగా భావించి అలా మాట్లాడానన్నారు. సుధీర్ నటనను ప్రశంసిస్తూ, ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసిందని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఇక 'గోట్' సక్సెస్ మీట్ నిర్వహించినంత మాత్రాన భారీ లాభాలు వచ్చాయని చెప్పడం లేదని నిర్మాత వివరించారు. సినిమా కోసం కష్టపడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తప్పుడు కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేయడం లేదని, కమర్షియల్‌గా లాభాలు వచ్చినప్పుడు మరో సక్సెస్ మీట్ నిర్వహిస్తామని చెప్పారు. కుటుంబ ప్రేక్షకులు, పిల్లల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    
  • nirmathatheproducer 
  • chandrasekharreddy 
  • sudigalisudheer 
  • goatmovie 
  • tollywood 

Similar News

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS