• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోట్ల ఆఫర్లయినా నో...

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

| డబ్బు, అవార్డుల కోసం సినిమాలు అంగీకరించడం లేదని బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తెలిపారు. కథ, పాత్ర నచ్చి కళాత్మక సంతృప్తి కలిగితేనే నటించేందుకు ఒప్పుకుంటానన్నారు. భారీ పారితోషికాలు ఆఫర్ చేసినా నచ్చని స్క్రిప్టులను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాలే ప్రేరణగా ఉండేవని, ఇప్పుడు మనశ్శాంతి, సృజనాత్మక ఆనందమే ముఖ్యమని చెప్పారు.

By - Srikanth Kontham
Update: 2026-11-14 19:30 GMT

బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌తీ సినిమా భారీ విజ‌యం అందుకుంటుంది. ఆ సినిమాలో పంక‌జ్ పాత్ర ప్ర‌త్యేకంగా హైలైట్ అవుతుంది. దీంతో పంక‌జ్ కెరీర్ లో పరిణతి చెందిన దశను ఆస్వాదిస్తున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎంతోమంది న‌టులు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ల కోసం పాకులాడుతుంటే? ఈ నేషనల్ అవార్డు గ్రహీత మాత్రం డబ్బు తనను ఉత్సాహపర చలేకపోతోందంటున్నారు. డ‌బ్బు విష‌యంలో త‌న ఆలోచ‌న పూర్తిగా మారిపోయింద‌న్నారు.

కెరీర్ ఆరంభ దశను సర్వైవల్ ఫేజ్ గా అభివర్ణించిన పంకజ్ త్రిపాఠి ఆ సమయంలో ప్రతి చిన్న అవకాశం గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చేదని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయన్నారు. డబ్బులు.. అవార్డుల కోసం ప్రాజెక్టులను అంగీకరించట్లేదని వెల్లడించారు. ఒక నటుడిగా తనకు లోపలి నుంచి క‌ళాత్మ‌క తృప్తిలభించకపోతే ఎంత పెద్ద మొత్తంలో రెమ్యూనిరేషన్ ఇస్తామన్నా? ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.

భారీ పారితోషికాలు ఇస్తామని నిర్మాతలు ముందుకు వ‌స్తున్నా? స్క్రిప్ట్ నచ్చకపోతే రిజెక్ట్ చేయడం కష్టంతో కూడుకున్నదేనని ఇప్పుడిప్పుడే అర్ద‌మ‌వుతుంద‌న్నారు. `ఎదుటి వ్యక్తి ఎన్నో ఆశలతో వస్తారు. వారి కెరీర్ ఆ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉండొచ్చనే మానవతా దృక్పథం నాలో ఉంటుంది. అయినా? ఆ కథ నన్ను మానసికంగా ఉత్తేజపరిస్తేనే ముందుకు అడుగేస్తాను. దర్శకులు డేట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి ఉంటామన్నా? నచ్చని పాత్ర లకు ఒప్పుకునే పద్ధతిని ఎప్పుడో మానేశానని తెలిపారు.

ఒకప్పుడు పని దొరకడమే పెద్ద ప్రేరణగా ఉండేదని కానీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న తర్వాత మనశ్శాంతి, సృజనాత్మక ఆనందమే అసలైన ఇంధనంగా మారుతాయని అర్ద‌మైంద‌న్నారు. ఇటీవ‌లే పంక‌జ్ త్రిపాటీ `మీర్జాపూర్ ది మూవీ` తో మంచి విజయం అందుకున్న సంగ‌తి తెలిసిందే. వెబ్ సిరీస్ గా మొద‌లై మూవీగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి రికార్డు సృష్టించిన చిత్ర‌మిది. అలాగే `పరివారిక్ మనారంజన్` సినిమాతోనూ ప్రేక్షకులను అల‌రించారు. ప్ర‌స్తుతం పంక‌జ్ త్రిపాఠీ బాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. కొత్త ఆఫ‌ర్లు ఎన్ని వ‌చ్చినా? సున్నితంగా తిర‌స్క‌రిస్తున్నారు. ఇలాంటి ప్ర‌తిభావంతులైన న‌టుల‌కు తెలుగు సినిమాల్లోనూ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని అభిమానులు కోరుతున్నారు.

Tags:    
  • pankajtripathi 
  • bollywood 
  • mirzapur 
  • indianactors 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS