82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?
| హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కుమారుడు జేడెన్ స్మిత్ (28), 82 ఏళ్ల ఫ్రెంచ్ ఫ్యాషన్ ఐకాన్ మిషెల్ లామీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి ఫోటోలు ఏఐతో సృష్టించినవని తెలుస్తోంది. మిషెల్ తన భర్తతోనే ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఎంగేజ్మెంట్ వార్తలు ఫేక్ అని స్పష్టమవుతోంది.
82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ వచ్చిన ఒక వార్త సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఒక స్టార్ హీరో కొడుకు అందులోనూ 82 సంవత్సరాల వయసున్న బామ్మతో నిశ్చితార్థం చేసుకోవడం ఏంటి? అసలు ఇది నిజమేనా? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు? ఆయన కొడుకు ఎవరు? ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వచ్చిన వార్తలలో నిజం ఎంత? ఆ 82 సంవత్సరాల బామ్మ ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. 28 ఏళ్ల వయసున్న.. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ కొడుకు జాడెన్ స్మిత్.. 82 సంవత్సరాల వయసున్న ఫ్రెంచ్ ఫ్యాషన్ ఐకాన్ మిషెల్ లామీ తో రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే రూమర్లు కూడా వచ్చాయి. పైగా వీరిద్దరూ కలిసి ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
అసలు ఇది నిజమేనా? అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైరల్ అవుతున్న ఫోటోలపై ఆరా తీయగా ..ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ జనరేటర్ అని, లామీ తన భర్తతో ఇప్పటికీ కలిసే ఉన్నారని సమాచారం. ఏది ఏమైనా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ ఫోటోలు ఒక్కసారిగా వీళ్ళిద్దరిని మళ్లీ వార్తల్లో నిలిపేలా చేసిందని చెప్పవచ్చు.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ విషయానికి వస్తే.. 1995 నుండి 2024 వరకు స్ట్రీమింగ్ అయిన బ్యాడ్ బాయ్స్ సిరీస్‌లో తన అద్భుతమైన నటన కనబరిచి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే, ఐ రోబోట్, ఐ యాం లెజెండ్, హాన్కాక్, సూసైడ్ స్క్వాడ్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బయోపిక్‌లతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా నటించారు.
విల్ స్మిత్ వారసుడు జేడేన్ స్మిత్ విషయానికి వస్తే నటుడిగా, ర్యాపర్ సింగర్ గా మంచి పేరు సొంతం చేసుకున్నారు. 2006లో వచ్చిన ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఆఫ్టర్ ఎర్త్ చిత్రాలలో తన తండ్రితో కలిసి నటించారు. ఇక 2010లో ది కరాటే కిడ్ అనే చిత్రం ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.
అటు ఫ్రెంచ్ ఫ్యాషన్ ఐకాన్ మిషెల్ లామీ విషయానికి వస్తే.. ఈమె ఫ్రెండ్స్ ఫ్యాషన్ ఐకాన్ గా పేరు సొంతం చేసుకున్నారు వ్యాపారవేత్త, డిజైనర్ అలాగే సాంస్కృతిక ప్రముఖురాలు కూడా..