జోరు పెంచిన శృతిహాసన్!
| ‘ఆకాశంలో ఒక తార’, ‘ట్రైన్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న శృతిహాసన్.. ప్రభాస్ సరసన ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’లోనూ నటిస్తోంది. నవంబర్ 20న ‘ఆకాశంలో ఒక తార’, డిసెంబర్ 4న ‘ట్రైన్’ విడుదల కానున్నాయి. నటిగా, సింగర్‌గా బిజీగా ఉన్న ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 23.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. నటి గానే కాకుండా సింగర్ గా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది.. ముఖ్యంగా పలు చిత్రాలలో స్వయంగా పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనగనగా ఒక ధీరుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శృతిహాసన్ పలు చిత్రాలు చేసింది కానీ అవేవీ ఈమె కెరియర్కు వర్కౌట్ కాలేదు.దాంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది.
కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ ఒక్క సినిమాతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న శృతిహాసన్ మళ్లీ అడపాదడపా సినిమాలు చేసి ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.
అలాంటి ఈమె మొన్నటి వరకు సైలెంట్ అయిపోయింది కానీ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నటిస్తున్న చిత్రం ఆకాశంలో ఒక తార. పవన్ సాధినేని దర్శకత్వం లో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఇందులో శృతిహాసన్ కీలకపాత్ర పోషిస్తుండగా స్వాసిక, రుహాని శర్మ , మురళీ శర్మ , గెటప్ శ్రీను, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటూ ఆడియన్స్ లో మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన తదుపరి ప్రాజెక్టులపై కూడా స్పందించింది. ప్రస్తుతం మైస్కిన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ట్రైన్ అనే చిత్రంలో కూడా ఈమె నటించింది. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం అనే చిత్రంలో కూడా ఈమె నటిస్తోంది.
ఇక ఇటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటోషూట్ తో అభిమానులను ఆకట్టుకునే ఈమె ఒక్క ఇంస్టాగ్రామ్ ద్వారానే సుమారుగా 23.5 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. 23.5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. మొత్తానికైతే ఒకవైపు సింగర్ గా మరొక వైపు నటిగా మరింత బిజీగా మారిపోయింది శృతిహాసన్.