• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా...

పోలీస్ ఆఫీసర్‌గా ఫిదా చేసేనా?

| ‘ప్రేమమ్’తో గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పటివరకు ఎక్కువగా సహజమైన, పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో కనిపించింది. ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం’ సినిమాలో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్, సాయి పల్లవి మధ్య యాక్షన్ సన్నివేశాలు ఆసక్తి పెంచుతున్నాయి. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

By - Ramesh Palla
Update: 2026-11-14 16:26 GMT

మలయాళ మూవీ 'ప్రేమమ్‌' తో సౌత్‌ ఇండియా మొత్తం ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌లో సెటిల్‌ కావాలి అనుకున్న సాయి పల్లవికి అనుకోని అవకాశంగా ప్రేమమ్‌ మూవీ దక్కింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా ప్రేమమ్‌ తో సాయి పల్లవి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని హీరోయిన్‌గా బిజీ అయింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ సినిమాల్లోనూ ఆఫర్లు రావడం, తక్కువ సమయంలోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారడం అంతా చకచక జరిగి పోయింది. టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈమెకు ఏకంగా లేడీ పవర్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చారంటే ఏ స్థాయిలో ఈమెను అభిమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సాయి పల్లవి ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో ఎక్కువగా కనిపించింది. చాలా సింపుల్‌ అండ్‌ విలేజ్‌ లుక్‌లో సాయి పల్లవి కనిపించి నేచురల్‌ బ్యూటీ అనిపించుకున్న విషయం తెల్సిందే.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు...

ప్రేమమ్‌ సినిమా మొదలుకుని ఫిదా, మిడిల్ క్లాస్‌ అబ్బాయి, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్ ఇలా ప్రతి సినిమాలోనూ ఆమెను సింపుల్‌గానే ప్రేక్షకులు చూశారు. ఇటీవల వచ్చిన రామాయణ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించింది. కొందరు సీత పాత్రకు సాయి పల్లవి బెస్ట్‌ ఎంపిక అంటూ ప్రశంసిస్తే, కొందరు మాత్రం సీత పాత్రకు సాయి పల్లవి సెట్‌ కాలేదు అంటూ ట్రోల్స్ చేశారు. మొత్తానికి సాయి పల్లవి సీతగా మిశ్రమ స్పందన దక్కించుకున్నా, సినిమా మాత్రం భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. తక్కువ సమయంలోనే రూ.1000 కోట్లు వసూళ్లు రాబట్టి, రెండు వేల కోట్ల రూపాయల వసూళ్ల వైపు దూసుకు పోతుంది. సాయి పల్లవి ఖాతాలో వెయ్యి కోట్ల సినిమా పడింది. ఇప్పుడు సాయి పల్లవి నటించిన ఓం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఓం సినిమాలో సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న నేపథ్యంలో చర్చ మొదలైంది.

ధనుష్ ఓం సినిమాలో సాయి పల్లవి...

ధనుష్ హీరోగా శ్రీలీల, సాయి పల్లవి ముఖ్య పాత్రల్లో నటించిన 'ఓం' సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. తాజాగా వచ్చిన ట్రైలర్‌ అంచనాలను భారీగా పెంచింది. సాయి పల్లవిని పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా చూపించారు. ఇప్పటి వరకు సాయి పల్లవిని పోలీస్‌ పాత్రల్లో చూసిందే లేదు. మొదటి సారి పవర్‌ ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో చూపించబోతున్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి పల్లవి ఇప్పటివరకు పోషించిన ప్రతి పాత్రలోనూ ఆకట్టుకుంది. ఆమె ప్రతి పాత్రకు తన నటనతో మంచి మార్కులు దక్కించుకుంది. కానీ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆమె ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది కాస్త అనుమానంగా ఉందని స్వయంగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

పోలీస్‌ ఆఫీసర్‌గా సాయి పల్లవి...

ఓం సినిమాలో ధనుష్‌ వర్సెస్‌ సాయి పల్లవి అన్నట్లుగా సీన్స్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో సీన్స్ ఉన్నాయి. అవి లవ్‌ సీన్స్‌ కానీ ఈసారి యాక్షన్‌ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సాయి పల్లవి చేయని రేంజ్‌ లో భారీ యాక్షన్‌ సీన్స్‌ ను ఓం సినిమాలో చూడబోతున్నట్లు ట్రైలర్‌ లోని కొన్ని షాట్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. కనుక ఓం సినిమా విడుదల అయ్యే వరకు సాయి పల్లవి పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూనే ఉంది. సుకుమారిగా, నేచురల్‌ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇలా రఫ్‌ అండ్‌ రస్టిక్‌ పాత్రలో ఫిదా చేస్తుందా అనేది చూడాలి. ఓం సినిమాలో ధనుష్‌ తో పాటు మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టీ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు పెరిగాయి. తమిళ్‌ లో రూపొందినప్పటికీ తెలుగులోనూ ఈ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. పెద్దగా పోటీ లేని సమయంలో విడుదల కాబోతుంది. కనుక బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేనా చూడాలి.

Tags:    
  • saipallavi 
  • dhanush 
  • ommovie 
  • saipallavicoprole 
  • mammootty 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS