హిట్ తో సంబంధం లేకుండా కింగ్ ఛాన్స్ !

యువ సామ్రాట్ నాగ చైత‌న్య క‌థానాయ‌కుడిగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో `వృష‌క‌ర్మ` అనే మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-03-07 13:30 GMT

యువ సామ్రాట్ నాగ చైత‌న్య క‌థానాయ‌కుడిగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో `వృష‌క‌ర్మ` అనే మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాపై ఆద్యంతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి జాన‌ర్ లో సినిమా చేయ‌డం చైత‌న్య‌కు ఇదే తొలిసారి. సినిమాపై చై ఎంత కాన్పిడెంట్ గా ఉన్నాడు? అన్న‌ది చెప్ప‌డానికి మొన్న‌టి గ్లింప్స్ ఈవెంట్ చ‌క్క‌టి ఉద‌హార‌ణ. సినిమా రిలీజ్ కు ముందు త‌న కెరీర్ లో ఉత్త‌మ చిత్రంగా నిలుస్తుంద‌ని ప్ర‌క‌టించాడు. అటే ఎంత న‌మ్మ‌కం లేక‌పోతే చై ఆ ప్ర‌క‌ట‌న చేస్తాడు.

ఇంత వ‌ర‌కూ ఏ సినిమా విష‌యంలో చైత‌న్య ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో `వృష‌క‌ర్మ‌`పై అంచ‌నాలు రెట్టింపు అవుతున్నాయి. పైగా `విరూపాక్ష` త‌ర్వాత కార్తీంద్ దండు తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఇదే కావ‌డం విశేషం. `విరూపాక్ష` ఏకంగా 90 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎంతో లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ `వృష‌క‌ర్మ‌`ను తెర‌కెక్కిస్తున్నారు. సుకుమార్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వ్వ‌డం సినిమాకు అద‌నంగా క‌లిసొచ్చే అంశం. ఇలా ఎన్నో కార‌ణాలు `వృశ‌క‌ర్మ‌`ను ఆద్యంతం హైలైట్ చేస్తున్నాయి.

అదే న‌మ్మ‌కంతో కింగ్ నాగార్జున కార్తీక్ విష‌యంలో మ‌రో స్టెప్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రెండ‌వ కుమారుడు అఖిల్ తో ఓ సినిమా చేయ‌మ‌ని నాగ్ అడిగారుట. అందుకు కార్తీక్ కూడా త‌ప్ప‌కుండా అంటూ ప్రామిస్ చేసాడుట‌. ఆ చిత్రాన్ని నాగార్జున అన్న‌పూర్ణ స్టూడియోస్లోనే నిర్మిస్తాన‌ని..బ‌యట నిర్మాత‌లెవ‌రికీ ఛాన్స్ ఇవ్వ‌ను అని ఓపెన్ గా చెప్పేసారుట‌. మ‌రి ఇందులో నిజ‌మెంతో తేలాలి. సాధార‌ణంగా నాగార్జున ఏ డైరెక్ట‌ర్ ను త‌న‌తో గానీ, అకిల్ తోగానీ, చైత‌న్య తో గానీ సినిమాలు చేయండని అడ‌గ‌రు. కానీ నాగ చైత‌న్య వ‌రుస ప్లాప్ ల్లో ఉన్న స‌మ‌యంలో ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏ డైరెక్ట‌ర్ ని అయినా పిలిపించ‌మంటావా? అని నాగ్ అడిగారు.

అందుకు చైత‌న్య ఎంతమాత్రం ఒప్పుకోలేదు. త‌న డైరెక్ట‌ర్ల‌ను తానే సెల‌క్ట్ చేసుకుంటాన‌ని చెప్పాడు. అప్ప‌టి నుంచి నాగార్జున డైరెక్ట‌ర్ల విష‌యంలో ఇన్వాల్వ్ అవ్వ‌డం లేదు. తాజాగా కార్తీక్ దండు విజ‌యాలు చూసే? ప్ర‌తిభా వంతుడైన ద‌ర్శ‌కుడిని కాంపౌండ్ దాట‌నివ్వ‌డం ఎందుక‌ని ముందుగానే లాక్ చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే కార్తీక్ దండు త‌దుప‌రి సినిమా అఖిల్ తో చేసే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు `రా` కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలోఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మైసూర్ లో షూటింగ్ జ‌రుగుతుంది. అక్క‌డ షూట్ అనంత‌రం తిరిగి య‌ధావిధిగా హైద‌రాబాద్ షూట్ మొద‌ల‌వుతుంది.

Tags:    

Similar News