యూరప్ పర్యటనలో పూజా హెగ్డే అల్లరే అల్లరి.. ప్రేమలో పడ్డ ఫ్యాన్స్!
సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కు కామెంట్ల సెక్షన్ అభిమానుల ప్రేమతో నిండిపోయింది. వేలాది మంది అభిమానులు హార్ట్- ఫైర్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
నేటి జెన్ -జిలో వరుసగా పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే. దురదృష్టవశాత్తూ సోలో హీరోయిన్ గా చేసిన చాలా సినిమాలు ఫ్లాపులు అయినా.. ఈ అమ్మడికి అవకాశాల పరంగా కొదవేమీ లేదు. ఇండస్ట్రీ టాప్ బ్యూటీగా ఏల్తున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ అప్‌డేట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ ముంబై బ్యూటీ హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నగర పర్యటనకు సంబంధించిన విశేషాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారుతున్నాయి.
``దీనికంటే ఉత్తమమైన ట్రాక్‌ను ఎంచుకోలేకపోయేదాన్ని`` అనే క్యాప్షన్‌తో పూజా హెగ్డే షేర్ చేసిన ఫొటోలు -వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యూరప్‌లోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని.. అక్కడి వీధుల్లో తను గడిపిన సరదా మూవ్ మెంట్స్ ను ఈ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ లో పూజా హెగ్డే సరికొత్త హెయిర్ స్టైల్.. స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త షార్ట్ హెయిర్ కట్‌తో కనిపిస్తుండటంతో ఫ్యాషన్ ప్రియులు- అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూరప్‌లోని ఎండలో ఈ బ్యూటీ మెరిసిపోతున్న తీరును చూసి ``యూరోపియన్ సన్ నీకు బాగా సరిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పూజా షార్ట్ స్కర్ట్ - క్లాసిక్ స్టైల్‌లో కనిపించిన విధానం జెన్-జెడ్ ఫ్యాషన్ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కు కామెంట్ల సెక్షన్ అభిమానుల ప్రేమతో నిండిపోయింది. వేలాది మంది అభిమానులు హార్ట్- ఫైర్ ఎమోజీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్యూటీ, జార్జియస్, ఏంజెల్ అంటూ కొందరు పొగడ్తలతో ముంచెత్తగా.. మరికొందరు పూజా నటనకు, అందానికి జేజేలు పలుకుతూ సుదీర్ఘమైన కవితాత్మక కామెంట్లను కూడా జత చేశారు. బుట్టబొమ్మ సహజసిద్ధమైన అందం, క్యూట్ హావభావాలు ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటున్నాయని ప్రశంసిస్తున్నారు.
కామెంట్స్ సెక్షన్ లో కొన్ని ఆసక్తికరమైన వ్యక్తీకరణలు కూడా కనిపించాయి. ఫొటోల నేపథ్యం లేదా కొన్ని సన్నివేశాలను చూసి కొందరు నెటిజన్లు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఎర్లింగ్ హాలాండ్ ప్రస్తావనను తీసుకువచ్చి `హాలాండ్‌ను అసలు ఊహించలేదు` అంటూ కామెంట్లు చేశారు. అలాగే తన ఫొటోగ్రఫీని మెచ్చుకుంటూ కెమెరా వెనుక ఉన్న ఫొటోగ్రాఫర్‌ను కూడా అభినందించాలని కొందరు సూచించడం విశేషం. మరికొందరు తమ అభిమాన నటిని యూరప్‌లో కలవడంపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మొత్తానికి బుడాపెస్ట్‌లో పూజా హెగ్డే చేస్తున్న ఈ రచ్చ సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నా.. లొకేషన్ల నుంచి సమయాన్ని కేటాయించుకుని ఇలాంటి స్టైలిష్ - సరదా పోస్ట్‌లు పెడుతూ అభిమానులను ఎంటర్‌టైన్ చేయడంలో పూజా ఎప్పుడూ ముందే ఉంటారు. ఈ భామ గ్లామరస్ లుక్స్, కొంటె చేష్టలు, ఫ్యాషన్ సెన్స్ మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. పూజా నటించిన జననాయగన్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. తదుపరి హారర్ మూవీ కాంచన 4 లో నటిస్తోంది. అలాగే శ్రీశ్రీ అనే మరో చిత్రంలోను నటిస్తూ బిజీగా ఉంది.