ఓవర్సీస్‌లో ‘వారణాసి’.. ఆ నిర్ణయం బాక్సాఫీస్ లెక్కలను మారుస్తుందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2026-03-07 14:30 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రూ. 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ అడ్వెంచర్ డ్రామాగా నిలవబోతోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు ఇంటర్నేషనల్ లెవల్‌లో క్రేజ్ వచ్చింది.

ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, 2027 ఏప్రిల్ 7న గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, జక్కన్న విజన్ కలగలిసి ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అంచనాలను మరింత పెంచుతున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లో ఒక కొత్త చర్చ మొదలైంది. రీసెంట్‌గా నార్త్ అమెరికాలో 'ధురంధర్ 2' అనే సినిమాను కేవలం 9 డాలర్ల టికెట్ ధరకే అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా ఫస్ట్ డే నుంచే ఏఎంసీ పాసెస్ అనుమతించడంతో అక్కడ ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ టికెట్ ధరలు ఉండటం కామన్, కానీ ఈ తక్కువ ధరల ఫార్ములా ఇప్పుడు ఒక హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మార్పును గమనించిన ఎన్ఆర్ఐ తెలుగు ప్రేక్షకులు కూడా ‘వారణాసి’ టీమ్ కి ఒక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. మహేష్ బాబు సినిమాను కూడా అదే తరహాలో 9 డాలర్ల టికెట్ ప్రైసింగ్‌తో రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఓవర్సీస్‌లో తెలుగు సినిమాల బాక్సాఫీస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

సాధారణంగా అమెరికా వంటి దేశాల్లో సినిమా రేట్లు పెరగడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడానికి కాస్త ఆలోచిస్తుంటారు. ఒకవేళ టికెట్ ధరలు అందుబాటులోకి వస్తే మాత్రం ‘వారణాసి’ లాంటి భారీ సినిమాకు వసూళ్ల సునామీ ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే కనుక జరిగితే టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ లో ఒక కొత్త ట్రాక్ దొరికినట్లే. మరి మేకర్స్ ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, టికెట్ ధరల విషయంలో తీసుకునే ఇలాంటి చిన్న నిర్ణయాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద గేమ్ చేంజర్ అవుతాయి. రాజమౌళి మార్క్ మేకింగ్‌కు మహేష్ బాబు ఇమేజ్ తోడవ్వడంతో ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉంది. దీనికి తోడు అఫోర్డబుల్ టికెట్ ప్రైసింగ్ కూడా కలిస్తే రికార్డులన్నీ తిరగరాయడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ క్రేజీ డిమాండ్ పై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News