సూర్య, వెంకీ మూవీ ఏం జరుగుతోంది?
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, ఒక పాట, యాక్షన్ సీన్‌ను ప్రస్తుతం వేస్తున్న సెట్‌లో వచ్చే నెల నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి.;
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి బ్యాక్ టు బ్యాక్ సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో కమర్షియల్ సక్సెస్‌లను దక్కించుకున్నాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో వెంకీ అట్లూరి క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ రెండు సినిమాలు కూడా తెలుగేతర హీరోలతో చేసిన వెంకీ అట్లూరి మరోసారి తమిళ హీరోతో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. తమిళ్ స్టార్ హీరో సూర్యతో ఇప్పటికే వెంకీ అట్లూరి సినిమా ప్రారంభం అయింది. కంగువా, రెట్రో సినిమాలతో తీవ్రంగా నిరాశ పరిచిన సూర్య హీరోగా వెంకీ అట్లూరితో చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు నటిస్తున్న విషయం తెల్సిందే. మరో హీరోయిన్‌కి ఈ కథలో స్పేస్ ఉందని, ఆ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
సూర్య, వెంకీ సినిమా కోసం..
సూర్య 46 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు ఈ సినిమా కోసం భారీ సెట్టింట్ ఏర్పాటు మొదలు పెట్టారని తెలుస్తోంది. సినిమాలోని మెజార్టీ పార్ట్ షూటింగ్ ఆ సెట్‌లో చేయనున్నారు. ఆ సెట్ నిర్మాణం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారని తెలుస్తతోంది. ఇప్పటి వరకు సూర్య చేసిన సినిమాలన్నింటిలోకి ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. వెంకీ అట్లూరి పై నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా తమిళ్, ఇతర భాషల ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సూర్యకి జోడీగా మరో హీరోయిన్
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు, ఒక పాట, యాక్షన్ సీన్‌ను ప్రస్తుతం వేస్తున్న సెట్‌లో వచ్చే నెల నుంచి చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలుకుని షూటింగ్ పూర్తి అయ్యే వరకు కంటిన్యూగా షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. గత షెడ్యూల్‌లో సూర్య, మమిత బైజులపై సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. మరో వైపు సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ బోర్సే ను సంప్రదించారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కయాదు లోహర్‌తోనూ సంప్రదింపులు జరిపారు అంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రకరకాలుగా పుకార్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు దర్శకుడు వెంకీ అట్లూరి కానీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి నాగవంశీ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.
నాగ వంశీ నిర్మాణంలో సూర్య 46
సూర్య ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ సినిమాల తర్వాత ఆ స్థాయి విజయాలను సూర్య అందుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి స్పందన ఉన్న సూర్యకు ఈ సినిమా ఖచ్చితంగా మంచి మైలేజ్‌ను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సూర్యను ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో ఈ సినిమాలో అలా చూసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వెంకీ అట్లూరి సినిమా అనగానే ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు గాను నిర్మాత నాగవంశీ రెడీగా ఉన్నాడు. అంతే కాకుండా బయ్యర్లు భారీ మొత్తంలో ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారు.