• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోతో రాజమౌళి కి ఉన్న...

ఆ హీరోతో రాజమౌళి కి ఉన్న అనుబంధం చూసి షాక్ అవుతున్న నెటిజెన్లు..

| రాజమౌళి, సూర్య కలిసి ఓ మూవీ చేయాలి అనుకున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు.

By - Tupaki Desk
Update: 2024-11-08 05:03 GMT

ఒకరేమో వైవిధ్యాని కేరోఫ్ అడ్రస్ గా ఉన్న స్టార్ హీరో.. మరొకరు దర్శక ధీరుడుగా ప్రపంచాన్నే మైమరపించిన డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబోలో నిజంగా ఒక మూవీ వస్తే అంతకంటే మూవీ లవర్స్ కి పండగ మరొకటి ఉండదు. ఆ హీరో డైరెక్టర్ మరెవరో కాదు.. సౌత్ స్టార్ హీరో సూర్య, స్టార్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి. ఈ ఇద్దరు కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది.. కానీ కొన్ని కారణాలవల్ల అది కుదరలేదు. రాజమౌళి, సూర్య కలిసి ఓ మూవీ చేయాలి అనుకున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా సూర్య వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

సూర్య ప్రస్తుతం కంగువ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక ఇందులో రాజమౌళి,విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈవెంట్ లో మాట్లాడుతూ సూర్య తాను ఎక్కాల్సిన ట్రైన్ను మిస్ అయ్యానని.. అయితే ఇప్పుడు రైల్వేస్టేషన్లో నిలబడి ఉన్న తాను ఎప్పటికైనా ఆ ట్రైన్ ని పట్టుకోవాలి అని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఇంతకీ సూర్య ప్రస్తావించిన ఆ ట్రైన్ మరెవరో కాదు రాజమౌళి.. అతనితో సినిమా మిస్ అయ్యాను అని చెప్పిన సూర్య ఎప్పటికైనా తిరిగి రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్న తన ఉద్దేశాన్ని వెల్లడించారు. ఇక దీనికి స్పందించిన రాజమౌళి సూర్యా ను ప్రశంసలతో ముంచెత్తాడు. గజినీ మూవీతో సూర్య తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు అని రాజమౌళి ప్రశంసించారు. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీ చిత్రాలను తీయడానికి ఓ రకంగా తనకు సూర్యానే ఇన్స్పిరేషన్ అని రాజమౌళి పేర్కొన్నారు.

అలాగే సూర్యతో కలిసి సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది తానేనని రాజమౌళి స్పష్టం చేశారు. ఈ ఇద్దరి అనుబంధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్ కి ఇన్స్పిరేషన్ గా సూర్యా నిలవడం నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజెన్స్. రాజమౌళి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో నవంబర్ 14న విడుదల కాబోతున్న కంగువా మూవీ కి మరింత క్రేజ్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

In some function #Suriya said he missed an opportunity. No, actually it's me who missed an opportunity.

I love him so much... I love his acting so much... I love his onscreen presence so much.

- #Rajamouli at #Kanguva pre release event#KanguvaFomNov14 #Tupaki pic.twitter.com/TSN1JehDzh

— Tupaki (@tupaki_official) November 7, 2024
Tags:    
  • Suriya 
  • Rajamouli 
  • Kanguva 
  • Kanguvaprereleaseevent 
  • Rajamoulispeech 
  • Siva 
  • Uvcreations 
  • Tollywood 
  • Kollywood 
  • Ghajini 
  • Filmindustry 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS