• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య వారసుడు...

సూర్య వారసుడు సినిమాల్లోకి...!

| మీ కొడుకు దేవ్‌ సినిమాల్లోకి వస్తాడా అంటూ ప్రశ్నించిన సమయంలో సూర్య స్పందిస్తూ..

By - Tupaki Desk
Update: 2024-10-28 05:12 GMT

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన 'కంగువా' సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సూర్య గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌లో మకాం వేసి ప్రత్యేక ఇంటర్వ్యూలు, టాక్‌ షోలు, రియాల్టీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఒక తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సూర్య సినిమా గురించే కాకుండా పలు వ్యక్తిగత విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కంగువా సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరం కష్టపడ్డాం. తప్పకుండా అందుకు తగ్గట్టుగా సినిమా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చిన సూర్య తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తారా అనే ప్రశ్న మీడియా సమావేశంలో ఎదుర్కొన్నారు. తండ్రి గుర్తింపుతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సూర్య అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా హీరోగా తమిళనాటనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఆయన నటించే ప్రతి సినిమా తమిళ్‌ తో పాటు తెలుగులోనూ విడుదల అవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. సూర్య నటనపై మొదటి నుంచి ఆసక్తి కనబర్చలేదట. చదువు పూర్తి అయిన వెంటనే మూడు సంవత్సరాల పాటు గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పని చేశాడు.

తన ఫ్యూచర్‌ మొత్తం గార్మెంట్‌ ఫ్యాక్టరీలోనే అనుకున్న సూర్యకు అనూహ్యంగా సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన నేను ప్రతి విషయంలోనూ కష్టపడ్డాను. అందుకే ప్రేక్షకులు అభిమానులు నన్ను ఆధరిస్తున్నారనే అభప్రాయంను వ్యక్తం చేశారు. మీ కొడుకు దేవ్‌ సినిమాల్లోకి వస్తాడా అంటూ ప్రశ్నించిన సమయంలో సూర్య స్పందిస్తూ... ప్రస్తుతం దేవ్‌ 9వ తరగతి చదువుతున్నాడు. అతడి చదువు పూర్తి అవ్వడానికే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం చదువుతో పాటు ఆటల్లోనూ ముందు ఉంటున్నాడు. భవిష్యత్తులో ఏ రంగంను ఎంచుకున్నా తన పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని సూర్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి దేవ్‌ ఏ రంగం వైపు అడుగులు వేస్తాడు అనేది చెప్పలేను అన్నారు.

సూర్య కంగువా సినిమా విషయానికి వస్తే కోలీవుడ్‌ లో రూపొందిన అతి భారీ చిత్రాల్లో ఇది ఒకటి. ఆ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేసిన సూర్య గ్యాప్‌ తీసుకుని ఈ సినిమాతో రాబోతున్నారు. కమర్షియల్‌ సినిమాలను అందించిన శివ ఈ సినిమాని విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సూర్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో ఉంటుందని అంటున్నారు. తమిళ బాహుబలి అంటూ, మొదటి వెయ్యి కోట్ల తమిళ సినిమా అంటూ కంగువా గురించి తమిళ ఆడియన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా స్థాయిలో ఉంటుందా అనేది నవంబర్‌ 14న సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Suriya 
  • Kanguva 
  • Dev 
  • Jyothika 
  • Siva 
  • Kanguvapromotions 
  • bobbydeol 
  • Gnanavelraja 
  • Suriyamovies 
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS