స్టార్ హీరో డబుల్ యాక్షన్ మళ్లీ మళ్లీ!
స్టార్ హీరోలు డ్యూయెల్ రోల్స్ లో కనిపించడం అన్నది చాలా రేర్. స్టోరీ ఆధారంగా రెండు పాత్రలు డిమాండ్ చేస్తే తప్పా దర్శకుడు అంత ఈజీగా ఛాన్స్ తీసుకోడు.;
స్టార్ హీరోలు డ్యూయెల్ రోల్స్ లో కనిపించడం అన్నది చాలా రేర్. స్టోరీ ఆధారంగా రెండు పాత్రలు డిమాండ్ చేస్తే తప్పా దర్శకుడు అంత ఈజీగా ఛాన్స్ తీసుకోడు. ఎందుకంటే ఒకేసారి రెండు పాత్రలు చేయడం అన్నది ఏ నటుడికైనా సవాల్. అది దర్శకుడికి కూడా కత్తిమీద సాము లాంటిందే. ఎక్కడ తేడా జరిగినా తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. అందుకే స్టార్ హీరోతో ద్విపాత్రాభినయం అన్నది చాలా రేర్ గానే ఉంటుంది.
తాజాగా సూర్య మాత్రం బ్యాక్ టూ బ్యాక్ డ్యూయెల్ రోల్స్ కు రెడీ అవుతున్నారు. ఆ మధ్య రిలీజ్ అయిన భారీ పీరియాడిక్ చిత్రం `కంగువ`లో సూర్య డ్యూయెల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వైఫల్యం చెందింది. దీంతో సూర్య మళ్లీ ఇలాంటి సినిమాలు ఇప్పట్లో చేయ కూడదని నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు మరికొన్ని చిత్రాల్లోనూ సూర్య ద్విపాత్రాభినయం లో అలరించారు. వాటికి మంచి పేరొచ్చింది. `కంగువ` తర్వాత రిలీజ్ అయిన `రెట్రో` లో మాత్రం సింగిల్ రోల్ తోనే అలరించారు.
కానీ ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో నటిస్తోన్నతాజా చిత్రం `కరుప్పు`లో మాత్రం మరోసారి డ్యూయెల్ రోల్ తో అలరించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఇంత వరకూ ఈ సినిమాలో సూర్య సింగిల్ పాత్ర పోషి స్తున్నాడనుకున్నారంతా. కానీ సంగతేంటంటే స్క్రిప్ట్ రెండు రోల్స్ డిమాండ్ చేయడంతో ద్విపాత్రా భినయం చేస్తున్నట్లు తేలింది. ఇది ఆద్యాత్మిక అంశాలతో ముడిపడిన యాక్షణ్ థ్రిల్లర్ కావడంతో రెండు పాత్రలు డిమాండ్ చేస్తోందిట.
ఈ క్రమంలోనే సూర్య కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న సూర్య బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రెండు పాత్రలపై ఆ రోజు అధికారికంగా క్లారిటీ వస్తుం దని సమాచారం. అలాగే రిలీజ్ విషయాన్ని కూడా అదే రోజు ప్రకటిస్తారని వినిపిస్తుంది. దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తారనే ప్రచారం ఇప్పటికే సోషల్ మీడియాలో జరుగుతోన్న సంగతి తెలిసిందే.