• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుమంత్ ఆ రెండు హిట్...

సుమంత్ ఆ రెండు హిట్ సినిమాలు చేసుంటే

| అయితే నటుడిగా సుమంత్ కి ప్రేమ కథ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-07-27 05:05 GMT

కింగ్ నాగార్జున తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నట వారసత్వంతో ఆయన మనవడు సుమంత్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ కథ సినిమాతో సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే నటుడిగా సుమంత్ కి ప్రేమ కథ చిత్రం మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

సుమంత్ కి కమర్షియల్ గా ఫస్ట్ సక్సెస్ వచ్చింది మాత్రం సత్యం సినిమాతోనే. ఆ మూవీ లవ్ స్టోరీతో తెరకెక్కి మంచి హిట్ సొంతం చేసుకుంది. తర్వాత గౌరీ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడ నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల స్థాయిలో మరో సక్సెస్ అతనికి లభించలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన మళ్లీ రావా సినిమా చాలా కాలం తర్వాత ఆయనకి సక్సెస్ అందించింది.

ప్రస్తుతం సుమంత్ ఓవైపు ఇతర స్టార్స్ సినిమాలలో కీలక పాత్రలు చేస్తూనే హీరోగా కూడా కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేతిలో అనగనగా ఒక రౌడీ, వారాహి అనే రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు కూడా భిన్నమైన కథలతోనే తెరకెక్కుతూ ఉండడం విశేషం. తాజాగా సుమంత్ అహం రీబూట్ అనే మూవీతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించారు. కేవలం ఒకే క్యారెక్టర్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఇదిలా ఉంటే సుమంత్ తన కెరీర్ లో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ ని మిస్ చేసుకున్నాడు. తరుణ్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం నువ్వే కావాలి ఫస్ట్ సుమంత్ హీరోగా చేయాలని అనుకున్నారంట. అయితే ఎందుకనో అది సెట్ కాలేదు తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమ స్టోరీ కూడా ముందుగా సుమంత్ దగ్గరికే వెళ్ళిందంట. కానీ ఈ సినిమా కూడా ఆయన చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదంట. మరోసారి పూరి జగన్నాథ్ దేశముదురు కథని సుమంత్ కి వినిపించారంట.

అయితే ఈ కథ తనకి సెట్ కాదని ఆయన వదిలేసారు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని కూడా చెప్పారు. దేశముదురు సినిమాలో క్యారెక్టర్ కి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని, ఆ సినిమా మిస్ చేసుకోవడం వల్ల తనకి ఎలాంటి బాధ లేదని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. తొలిప్రేమ, నువ్వే కావాలి సినిమా ఎందుకు మిస్ చేసుకున్నారనేది తెలియదు.

ఒకవేళ ఈ రెండు సినిమాలు చేసి ఉంటే హీరోగా సుమంత్ స్టార్ ఇమేజ్ అందుకునేవాడనే మాట వినిపిస్తుంది. ఏది ఏమైనా మంచి టాలెంటెడ్ హీరో అయ్యుండి కూడా సుమంత్ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయారు. చాలా రోజుల నుంచి మంచి కమ్ బ్యాక్ సినిమా కోసం సుమంత్ వెయిట్ చేస్తున్నారు. మరి ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే చిత్రం ఏమవుతుందనేది వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • PremaKatha 
  • RamGopalVarma 
  • Satyam 
  • GowtamTinnanuri 
  • AhamReboot 
  • OTT 
  • Sumanth 
  • PrashanthSagarAtlluri 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS