ఫలితం ముందే ఊహించి స్కిప్ కొట్టిందా?
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమా ఫలితాన్ని పక్కాగా ముందే గుర్తించి వందశాతం సక్సెస్ అయిందా? అన్న సందేహం నెట్టింట వ్యక్తమవుతోంది . తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అమాయకురాలు అన్నారు.;
ఇండస్ట్రీకి రానంత సేపే? అమాయకత్వం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా మెలాగాలి అన్నది పరిశ్రమే నేర్పిస్తుంది. అవసరమైతే అలవాటుగా మార్చేస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కునే ధైర్యాన్ని సైతం కల్పిస్తుంది. ఇక్కడ మంచి ఉంటుంది. చెడు ఉంటుంది. ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయగ లిగిన వాళ్లే నిలబడతారు. ఇలా పరిస్థితులను బట్టి ఇండస్ట్రీలో మెలగలిగిన వాళ్లకు తిరుగుండదు. ఆ మెలకువలే అవకాశాలకు బాట వేస్తుంటాయి. రాబోయే పరిస్థితులను అంచనా వేయగలిగే సామార్ధ్యాన్ని అందిస్తుంటాయి.
స్టార్ డైరెక్టర్ చొరవతో:
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఓ సినిమా ఫలితాన్ని పక్కాగా ముందే గుర్తించి వందశాతం సక్సెస్ అయిందా? అన్న సందేహం నెట్టింట వ్యక్తమవుతోంది . తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అమాయకురాలు అన్నారు. చూడటానికి బాగుంటుందనే మాట తప్ప! హీరోయిన్ గా పనికొస్తుందా? అని కొందరు డైరెక్టర్లు కూడా సందే హం వ్యక్తం చేసారు. అయినా సరే ఓ స్టార్ డైరెక్టర్ సాహసించాడు. హీరోయిన్ లుక్ లోకి మార్చడంతో? ఒక్క సారిగా సీన్ మారింది. సౌత్ లోనే ఆమె అంత అందగత్తె లేదు అన్నట్లు ప్రోజెక్ట్ చేసారు కాల క్రమంలో.
సొంత నిర్మాణ సంస్థలాంటిదైనా:
ఇండస్ట్రీ తలుచుకుంటే ఇలా జరుగుతుందనడానికి ఆమె ఓ ఉదాహారణ. కాల క్రమంలో ఓ నిర్మాణ సంస్థ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఎంతో కాలంగా స్నేహాంగాను మెలుగుతోంది. టాలీవుడ్ లో తన సొంత నిర్మాణ సంస్థగాను చెప్పుకుంటుంది. కానీ అలాంటి నిర్మాణ సంస్థ నుంచి తానే నటించిన ఓ సినిమానే ప్రమోట్ చేయలేదు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. నిర్మాతలు ఆమె వైపు నుంచి కూడా ఎంతో సున్నితంగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
తనకు నచ్చకే అలా:
కానీ అసలు సంగ తేంటి? అన్నది సినిమా రిలీజ్ తర్వాతే బయట పడిందంటూ ఫిలిం సర్కిల్స్ లో చర్చకు దారి తీస్తోంది. ఇటీవలే ఆ స్టార్ హీరోయిన్ నటించిన లేడీ ఓరియేంటెడ్ చిత్రం రిలీజ్ అయింది. ఇటీవల రిలీజ్ అయినా సినిమా పరాజయాన్ని అమ్మడు ముందే గుర్తించి ప్రచారానికి దూరంగా ఉందంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఔట్ పుట్ చూసుకున్న తర్వాత తానెంత మాత్రం సంతృప్తిగా లేదని..అసలే ప్లాప్ ల్లో ఉన్న నటి మరోసారి మీడియా ముందుకొచ్చి హిట్ సినిమాగా ప్రమోట్ చేయడం ఎంత మాత్రం భావ్యం కాదని భావించి మీడియా ముందుకు రాలేదనే చర్చ సాగుతోంది.