SSMB 29 : టైటిల్ ఇదేనా? సైలెన్స్ కు కారణమేంటి?

సినిమాకు వారణాసి టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు దానిపై రాజమౌళి స్పందించలేదు.;

Update: 2025-10-10 15:30 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ SSMB 29.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం షూటింగ్ మొదలవ్వగా.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం మరో షెడ్యూల్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

అయితే సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అని అంతా ఫిక్స్ అయ్యారు. సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు మూవీ నుంచి రాజమౌళి.. ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా అఫీషియల్ గా ఇవ్వలేదు.

కొద్ది రోజుల క్రితం రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ప్రీ లుక్ ను షేర్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మెడలో నంది, త్రిశూలం, ఢమరుకం ఉన్న లాకెట్ ధరించిన మహేష్ లుక్ అందరినీ ఆకట్టుకోగా.. పూర్తి ఫస్ట్ లుక్ నవంబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు జక్కన్న ప్రకటించారు. టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే ఉంటుందని టాక్.

సినిమాకు వారణాసి టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు దానిపై రాజమౌళి స్పందించలేదు. అవునో కాదో కూడా చెప్పలేదు. కానీ ఇండస్ట్రీ బజ్ ప్రకారం.. సినిమా టీజర్ కట్‌ ను ఇప్పటికే వీఎఫ్ ఎక్స్ టీమ్ కు వారణాసి అనే వర్కింగ్ టైటిల్‌ తో రాజమౌళి పంపినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే సినిమాపై బజ్ మాత్రం అలాగే కొనసాగేందుకు రాజమౌళి ఎలాంటి విధంగా స్పందించకుండా సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రూ.1100 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినిమాకు కొత్త మైలురాయిగా SSMB 29 నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నారని టాక్. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ లు ఉండనున్న మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌ గా నటిస్తున్నారు. మాలీవుడ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Tags:    

Similar News