• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీవిష్ణుతో హై బడ్జెట్...

శ్రీవిష్ణుతో హై బడ్జెట్ యాక్షనా?

| అయితే శ్రీవిష్ణు ఒక చిత్రం తర్వాత మరో చిత్రం స్పీడ్ స్పీడ్ అనౌన్స్ చేసి చేస్తుంటారు. సామజవరగమణ రిలీజై రెండు నెలలు అయింది

By - Tupaki Desk
Update: 2023-09-01 10:41 GMT

వరుసగా ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ మూవీస్ తో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటారు నటుడు శ్రీవిష్ణు. కథల ఎంపికలో ప్రత్యేకత చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలా విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఆడియెన్స్ ముందుకు వచ్చే ఈ వర్సటైల్ హీరో.. చాలా కాలం తర్వాత రీసెంట్ గా సామజవరగమణ అనే ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీతో సక్సెస్ ను అందుకున్నారు.

అయితే శ్రీవిష్ణు ఒక చిత్రం తర్వాత మరో చిత్రం స్పీడ్ స్పీడ్ అనౌన్స్ చేసి చేస్తుంటారు. సామజవరగమణ రిలీజై రెండు నెలలు అయింది. కానీ ఇంకా తన కొత్త చిత్రం ప్రకటించలేదు. దీంతో ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందో అని ఫ్యామిలీ ఆడియెన్స్ అనుకున్నారు. అయితే తాజాగా ఆయన కొత్త సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది.

శ్రీవిష్ణకు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్.. శ్రీవిష్ణుతో ఓ సినిమా ప్లానింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుంచి సమాచారం అందింది. ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. శ్రీవిష్ణు కెరీర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ గా దీన్ని రూపొందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే దర్శకుడు ఎవరన్నది తెలియలేదు.

ఒకవేళ ఈ ప్రచారం కనుక నిజమైతే.. ఆ కథ ఎలా ఉంటుందో, అందులో శ్రీవిష్ణు పాత్ర ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే శ్రీవిష్ణు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసి డిఫరెంట్ పాత్రలు పోషించారు. చూడాలి మరి ఈ సారి శ్రీవిష్ణు ఎలాంటి రోల్, కథతో ఆడియెన్స్ ను అలరిస్తారో..

ఇకపోతే శ్రీవిష్ణు చివరి సినిమా సామజవరగమణ.. ఆయన కెరీర్ లోనే చాలా కాలం తర్వాత బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదట ఎటువంటి బజ్ లేకుండా వచ్చిన ఈ సినిమా కోసం.. మౌత్ టాక్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో శ్రీవిష్ణు గిరాకీ పెరిగింది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు అర్థమవుతోంది.

Tags:    
  • Samajavaragamanamovie 
  • Sreevishnu 
  • Tollywood 
  • Mythrimoviemakers 
  • Filmindustry 
  • Sreevishnumovie 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS