అందాల శ్రీముఖి.. ఏ ఔట్ ఫిట్ లోనైనా అదుర్సే!

అప్పుడప్పుడు ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చి షాక్ ఇస్తుంటోంది శ్రీముఖి. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

Update: 2024-05-02 11:30 GMT

బుల్లితెర యాంకర్ శ్రీముఖికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తన అందం, చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంటోంది. టెలివిజన్ టాప్ యాంకర్స్ లో ఒకరిగా వరుస టీవీ షోలతో అలరిస్తోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తూ తన అభిమానులు, ఆడియన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది.ప్రజెంట్ స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ లో టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతోంది.

 

ఓవైపు యాంకరింగ్ చేస్తూ.. మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది శ్రీముఖి. కెరీర్ విషయంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది. బ్యూటిఫుల్ ఫోటో షూట్స్ తో సందడి చేస్తుంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటోంది. అందులోనూ ప్రత్యేకమైన రోజు, పండుగ వేళల్లో మరింత స్పెషల్ గా రెడీ అయ్యి తన అందంతో ఆకట్టుకుంటోంది.

 

అప్పుడప్పుడు ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ పోజులు ఇచ్చి షాక్ ఇస్తుంటోంది శ్రీముఖి. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. గ్రే కలర్ వన్ మినిట్ శారీలో అందాలు ఆరబోసింది. పైటను పట్టుకుని పోజులు ఇచ్చింది. రకరకాల స్టిల్స్ లో అదరగొట్టేసింది. ఓర చూపులతో కుర్రకారు దృష్టిని తన వైపు తిప్పుకుంది. చెప్పాలంటే.. డైమండ్ సెట్, పాపిట చైన్ శ్రీముఖి అందాన్ని మరింత పెంచాయి.

 

ప్రస్తుతం శ్రీముఖి పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సొగసైన పోజులు అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. డ్రెస్సింగ్ కంటే చూపులతో ఫ్లాట్ చేస్తోందని అంటున్నారు. యాంకరింగ్ తో సిల్వర్ స్క్రీన్ పై, అందంతో నెట్టింట శ్రీముఖ జోరు వేరే లెవల్ లో ఉందని చెబుతున్నారు. మొత్తానికి అమ్మడిని ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తున్నారు. సింప్లీ సూపర్బ్ అని కొనియాడుతున్నారు.

Read more!

 

సినిమాల విషయానికొస్తే.. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్‌ మూవీలో యాక్ట్ చేసింది శ్రీముఖి. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఇప్పుడు మరో చిత్రంలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి విశ్వంభరలో శ్రీముఖి నటిస్తుందని టాక్ వస్తోంది. మెగాస్టార్ తో కలిసి మాస్ స్టెప్పులు కూడా శ్రీముఖి వేయనుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు.

Tags:    

Similar News